హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశారు చిత్రయూనిట్. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విష్ణు కు ఈసినిమాతో మంచి హిట్ వస్తుందన్న టాక్ కూడా నడుస్తుంది. ఇక మార్చి 19న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో కాస్త వినూత్నంగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే ‘మోసగాళ్ళు మానియా’ అనే కాంటెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఇందులో గెలిచిన వారికి సినిమా విడుదలవ్వక ముందే 10 నిమిషాల స్నీక్ పీక్ చూపిస్తామని విష్ణు ప్రకటించారు. ఇక ‘మోసగాళ్ళు మానియా’ కాంటెస్ట్ విన్నర్స్ కి వైజాగ్ లోని మెలోడీ థియేటర్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. మంచు విష్ణు, నవదీప్ కూడా వైజాగ్ వెళ్లి సందడి చేశారు.
Clicks of #DynamicStar @iVishnuManchu @pnavdeep26 from Vizag. 📸
10 mins of #Mosagallu movie have been played for the contest winners in Melody theatre. #MosagalluOnMarch19th@SunielVShetty @MsKajalAggarwal @ruhisingh11 @Naveenc212 @TheLeapMan @SamCSmusic @MangoMusicLabel pic.twitter.com/8LAtspDYAY— 24 Frames Factory (@24FramesFactory) March 12, 2021
కాగా నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు.. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: