చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో చిన్నప్పుడే తన నటనతో ఆకట్టుకున్నాడు తేజ. ఇక ఇటీవలే హీరోగా జాంబిరెడ్డి సినిమా చేసి తన మొదటి సినిమాతోనే హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తేజ తన రెండో సినిమా ఇష్క్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా ఇష్క్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో హీరో తేజ కాస్త సీరియస్ లుక్‌తో ఉండగా… అతడి ముందు హీరోయిన్ ప్రియా ప్రకాష్ నవ్వుతూ ఉంది. ఈ సినిమాకు నాట్ ఏ లవ్ స్టోరీ అని క్యాప్షన్ పెట్టగా ఇది లవ్ స్టోరీ కాదని ఈఫస్ట్ లుక్ పోస్టర్ తో చెప్పకనే చెప్పారు. అంతేకాదు లవ్ స్టోరీస్ సినిమాలు చూసి బోర్ అయ్యారా అంటూ తేజ ట్వీట్ చేయాగా.. ఈ సినిమా కూడా కొత్తగా ఉంటుందన్న అభిప్రాయానికి వస్తున్నారు.
Are you Bored of watching Love Stories?
Here’s presenting the First Zolt of #ISHQ💞 Not A Love Story!#PriyaPVarrier#SSRaju @mahathi_sagar#RBChoudary @ProducerNVP #ParasJain @MegaaSuperGood1 @adityamusic @haashtagmedia @UrsVamsiShekar #IshqFirstZolt pic.twitter.com/YWGLkImV1P
— Zombie Sajja (@tejasajja123) March 5, 2021
పలు బ్లాక్‌బస్టర్ ఫిలిమ్స్ అందించిన ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ 2021లో తన తొలి చిత్రంతో తెలుగులోకి తిరిగి వస్తోంది. యస్.యస్. రాజు దర్శకత్వం వహించే ఈ చిత్రానికి ఆర్.బి. చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించనున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: