పద్మశ్రీ దర్శకత్వంలో సాగర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘షాదీ ముబారక్’.దృశ్యా రఘునాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్‌రాజు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడ్డారు. ఓరోజు సాగర్ నా దగ్గరకు వచ్చి ట్రైలర్ చూపించినప్పుడు చాలా బావుందని చెప్పాను. సినిమా చూసినప్పుడు కొన్ని కరెక్షన్స్ చెప్పడమే కాకుండా, మా టీమ్ సపోర్ట్ కూడా అందించాను. నెమ్మదిగా సినిమా స్టార్ట్ అయ్యింది. ఫైనానాన్షియల్ గా కూడా కాస్త సపోర్ట్ చేసి సినిమాను పూర్తి చేశాను. అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ మార్చిలో రావాల్సిన ఈ సినిమా కోవిడ్ ఎఫెక్ట్‌కు ఈ మార్చి 5న వస్తుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. సాధారణంగా ఓ సినిమా అనుకున్నప్పుడు స్క్రిప్ట్ నుంచి ట్రావెల్ అయితేనే బ్యానర్ పేరు ఇస్తాను. కానీ ఈ సినిమా మధ్యలో జాయిన్ అయ్యాను. అయితే ఈ టీమ్ మంచి సినిమా చేశారనిపించింది. సినిమాను ప్రాపర్‌గా రిలీజ్ చేయించాలని అనుకునే మా బ్యానర్ ద్వారా సినిమాను రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాను. వీళ్లు అదృష్టవంతులు. రేపు మార్చి 5న విడుదలవుతున్న ఈ సినిమాను చూసి ప్రేక్షకులు సక్సెస్ చేస్తే నేను కూడా లక్కీ ఫెలోనే. సాధారణంగా నా జడ్జ్‌మెంట్ మీద నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వస్తారు. శాటిలైట్‌వాళ్లు, డిజిటల్ వాళ్లు సినిమా చూడగానే వెంటనే కొనేశారు. అక్కడే నా జడ్జ్‌మెంట్‌కరెక్ట్ అయ్యింది. టిక్కెట్టు కొని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు రేపు బయటకు వెళ్లేటప్పుడు నవ్వుతూ వెళతారనే గ్యారంటీ నేను ఇస్తాను. వెరీ గుడ్ ఎంటర్‌టైనర్. పద్మశ్రీగారు సినిమా ఇంట్రెస్టింగ్‌గా తెరకెక్కించారు. టీవీలో సాగర్ చాలా ఫేమస్.. తను సినిమాలకు యంగ్ హీరో. దశ్యా రంగనాథ్ చాలా ఈజీగా నటించింది. తన నటన చూసి ఆ అమ్మాయికి క్రెడిట్ ఇవ్వాలా, లేక డైరెక్టర్‌కా అనిపించింది. డెబ్బై శాతం సినిమా చూసి నవ్వుతూనే ఉంటారు. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
హీరో వీర్‌సాగర్ మాట్లాడుతూ – ‘‘నేను ఆర్.కె, మున్నా పాత్రలనే సిద్ధార్థ సినిమాలో పోషించాను. ఈ కథ విన్నప్పుడు ఈ కథ నాకు వర్కవుట్ అవుతుందో కాదో అని అనుకున్నాను. శ్రీనివాసరెడ్డిగారికి పద్మశ్రీ చెప్పిన కథ నచ్చింది. అలా ఈ జర్నీలో నాకు నా స్నేహితులు కూడా తోడయ్యారు. ఎంతగానో సపోర్ట్ చేశారు శ్రీను, వినోద్, సాయి. మేం సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత నా స్నేహితులకు సినిమా గురించి ఏమీ తెలియదు. నాకోసమే వచ్చారు. దాంతో నాపై తెలియని రెస్పాన్సిబిలిటీ ఏర్పడింది. చిన్న టెన్షన్ కూడా ఉండేది. ఏం జరిగిందో ఏమో కానీ రాజు అన్న వచ్చాడు. ‘రాజన్న.. మాటల్లో చెప్పలేను. మీరు చేసిన సాయం. షాదీ ముబారక్.. మీరు చేసిన సినిమాల్లో ఒక సినిమా కావచ్చు. కానీ మాకు మాత్రం ఇదే లైఫ్. అందరం ఊపరి పీల్చుకున్నాం. ఏం చేస్తున్నారంటే దిల్‌రాజుగారి సినిమా షాదీ ముబారక్ అని చెప్పుకున్నాం’. తెలియని ఓ గర్వం, ధైర్యం వచ్చింది. సీరియల్స్ వదిలేసినప్పుడు నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నానా? అనే సందేహం ఉండేది. కానీ ఇప్పుడు నా నిర్ణయం కరెక్టేనని నమ్ముతున్నాను. ఈ సినిమా రాజన్నది. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. రాజన్న, శిరీషన్న మా వెంట ఉండి ముందుకు నడిపారు. వారికి థాంక్స్. డైరెక్టర్ పద్మశ్రీ కథ చెప్పినప్పుడే నా చేంజ్ ఓవర్ అని ఫిక్స్ అయ్యాను. హేమ, హేమంత్, రాహుల్ రామకృష్ణ, భద్రమ్ అందరూ చక్కగా సపోర్ట్‌చేశారు. హీరోయిన్ కోసం ఎనిమిది నెలలు వెయిట్ చేశాం. ఒకటిన్నర నెల వర్క్‌షాప్‌లో పాల్గొంది. సత్యభామ క్యారెక్టర్ పక్కాగా కుదిరింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్’’ అన్నారు.
చిత్ర దర్శకుడు పద్మ శ్రీ మాట్లాడుతూ – ‘‘నేను కథను రాసుకునే సమయంలో పెర్ఫామెన్స్‌లు ఎలా ఉండాలని అనుకున్నానో దాన్ని సాగర్, దృశ్య తమ నటనతో పూర్తి చేశారు. దిల్‌రాజుగారు ఎంతో సపోర్ట్ చేశారు. బండిరత్నంగారికి, ఎడిటర్ మధుగారు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.
కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘సాగర్ నా చిన్ననాటి స్నేహితుడు. ఈ సినిమాను డబ్బులు కోసం చేయలేదు. సాగర్‌ని టీవీస్టార్ నుంచి మూవీ స్టార్‌గా చూడాలనే ఉద్దేశంతో చేశాం. తను తప్పకుండా సక్సెస్ అవుతాడని నమ్మకంతో చెబుతున్నాను. వందశాతం ఎఫర్ట్ పెట్టి చేశాం. దిల్‌రాజుగారి సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంత వరకు వచ్చేది కాదు. ఆయన సినిమా చూసి తప్పులను సరిదిద్దారు. మూవీ క్వాలిటీ ఇంకా ఎంతో పెరిగింది. ఆయనకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను’’ అన్నారు.
హీరోయిన్ దృశ్యా రంగనాథ్ మాట్లాడుతూ – ‘‘దిల్‌రాజుగారి బ్యానర్‌లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గొప్ప అనుభూతినిస్తుంది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్స్. ఈ ప్రయాణంలో చాలా సమస్యలను ఫేస్ చేశాం. పద్మశ్రీగారు నెరేట్ చేసినప్పుడే ఆయనలో ఎగ్జయిట్‌మెంట్ చూశాను. నన్ను తుపాకుల సత్యభామగా చక్కగా చూపించారు. సాగర్‌గారి రూపంలో మంచి కోస్టార్ దొరికారు. నన్ను యూనిట్ అంతా వారి కుటుంబంలో ఓ వ్యక్తిలా చూశారు. సునీల్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మార్చి 5న సినిమాను చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ మాట్లాడుతూ – ‘‘దిల్‌రాజుగారి బ్యానర్‌లో కలిసి పనిచేయడం చాలా లక్కీ. ఈ విషయాన్ని నేను ఇది వరకే చెప్పాను. సాగర్‌గారు అద్భుతంగా నటించారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సన్నివేశాలు జరిగి ఉంటాయనిపించేలా ఉన్నాయి. పద్మశ్రీగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మార్చి 5న విడుదలయ్యే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ బాలాజీ, ఆర్.జె హేమంత్, సినిమాటోగ్రాఫర్ జవహర్ రెడ్డి, నటి హేమ, కో ప్రొడ్యూసర్స్ సాయి, శ్రీనివాస్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: