వెన్నెల సినిమాతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి…సినిమా పేరునే ఇంటిపేరుగా తెచ్చుకున్న కమెడియన్ వెన్నెల కిషోర్. ఫెరెంట్ మాడ్యులేషన్.. మొహంలోనే కనిపించే ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్.. మధ్యమధ్యలో విచిత్రమైన ఇంగ్లీష్ పదాలు.. అద్భుతమైన కామెడీ టైమింగ్.. ఇవన్నీ ఈయన సొంతం. వెండితెర మీద విభిన్న పాత్రలతో మెరుస్తోన్న వెన్నెల కిషోర్.. అనేక సినిమాల్లో తన దైన కామెడీ పండించారు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ టాలీవుడ్ లో టాప్ కెమెడియన్లలో ఒకరిగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏ సినిమాలో చూసినా కూడా ఇప్పుడు వెన్నెల కిషోర్ కనిపించాల్సిందే. ప్రత్యేకంగా ఆయన కోసమే పాత్రలు సృష్టిస్తున్నారు దర్శకులు కూడా. గత రెండేళ్లుగా వెన్నెల కిషోర్ చేస్తున్న ప్రతి పాత్ర మంచి గుర్తింపునే తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లో ఆయనే కామెడీ మొత్తం లీడ్ చేస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలో వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ లో ఒక కామెడీ సీన్ మీకోసం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: