పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టెంపర్” మూవీ ఘనవిజయం సాధించింది. ప్రకాష్ రాజ్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి సాంగ్స్ అనూప్ రూబెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మణిశర్మ కంపోజ్ చేశారు. “టెంపర్”మూవీ బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ హీరోగా “సింబా”, తమిళ భాషలో విశాల్ హీరోగా “అయోగ్య ” టైటిల్స్ తో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది. “అయోగ్య ” తమిళ మూవీ డబ్బింగ్ జరుపుకుని తిరిగి తెలుగు లో రిలీజ్ కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“టెంపర్” మూవీ లో ఎన్టీఆర్ కరెప్టెడ్ పోలీస్ ఆఫీసర్ గా , తరువాత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన నటన లోని ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఎన్టీఆర్ స్టైలిష్ గా , హ్యాండ్సమ్ గా సిక్స్ ప్యాక్ లుక్ లో అభిమానులను అలరించారు. ఎన్టీఆర్ తన మేనరిజమ్స్ , బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “టెంపర్” మూవీ ని ఒక మాస్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: