ఆది ‘శశి’ టీజర్ రిలీజ్

Aadi’s Sashi Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movies Updates,Tollywood Movie Updates,Latest Tollywood News,2020 Telugu Movies News,Aadi,Sashi,Sashi Movie,Sashi Telugu Movie,Sashi Movie Teaser,Sashi Teaser,Sashi Telugu Movie Teaser,Sashi Official Teaser

జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ‘శశి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక త్వరలోనే సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ కూడా చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా ఈ రోజు ఆది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. మెగా స్టార్ చిరు చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్‌ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఆర్‌.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్‌ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. 2021 లో ప్రథమార్ధంలో సినిమా రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు ఆది. హారర్ బ్యాక్ డ్రాప్ లో ‘జంగిల్’ సినిమాలో చేస్తున్నారు… ఈ ద్విభాషా చిత్రాలతో తొలిసారి ఆది తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. అలానే ‘బ్లాక్’ అనే సినిమాలో కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో సెక్యూరిటీ గార్డ్ గా నటిస్తున్నాడు. ఇంకా కన్నడ చిత్రసీమలోకి సైతం అడుగు పెట్డబోతున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + twelve =