సుధీర్ బాబు-ఇంద్రగంటి.. ముచ్చటగా మూడోసారి

Actor Sudheer Babu and Indraganti Mohana Krishna To Team Up Again After Sammohanam Movie

పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇక సినిమాలో తన పాత్ర కోసం సుధీర్ గోదావరి యాస నేర్చుకుంటున్నట్టు తెలుస్తుంది. కాగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌లు విజయ్ చిల్లా, శశిదేవి‌రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా.. మరో సినిమాను కూడా లైన్ లో పెట్టేసాడు. ఇప్పటికే ఇంద్రగంటి మోహనకృష్ణ తో సుధీర్ బాబు సమ్మోహనం, వి సినిమాలు చేయగా ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు దర్శక, నిర్మాతలు.

కాగా బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందనుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన ఉప్పెన సినిమా హీరోయిన క్రితి శెట్టి నటించనుంది. దీనికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించనున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.