శ్రీవిష్ణు-రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో ‘గాలి సంపత్’

Actor Sree Vishnu Now Comes Back As Gaali Sampath

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ” రాజ రాజ చోర”. ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు. మేఘా ఆకాష్,సునయన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి తదితరులు నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో ముందుకు రాడానికి చూస్తున్నాడు. శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గాలి సంప‌త్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజేంద్ర ‌ప్ర‌సాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.

 

కాగా మూవీని ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్‌ పై ఎస్‌. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్, రైట‌ర్ గా వ‌ర్క్ చేశారు. ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరోరెండు రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + thirteen =