‘రామరాజు ఫర్ భీమ్’ – వాడి పొగ‌రు ఎగిరే జెండా

RRR Movie NTR Bheem Teaser Is Out

మొత్తానికి ఎన్టీఆర్ అన్నదే జరిగింది. `రామరాజు ఫర్ భీమ్` వీడియోను ఈ రోజు 11 గంటలకు విడుదల చేస్తున్నామని చెప్పడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ టైం వస్తుందా అని ఎదురుచూసారు. అయితే 11.30 కు టీజర్ ను రిలీజ్ చేస్తున్నామని రాజమౌళి ట్వీట్ చేసి ఎన్టీఆర్ అన్నట్టుగానే లేట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఫైనల్లీ దాదాపు రెండేళ్ల నుండి ఎదురు చూసిన ఎన్టీఆర్ అభిమానుల ఎదురుచూపులకు ముక్తి కలిగింది. `రామరాజు ఫర్ భీమ్` వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రామ్ చ‌ర‌ణ్ వాయిస్‌తో ప్రారంభ‌మైన వీడియోలో.. వాడు క‌న‌బ‌డితే స‌ముద్రాలు త‌డ‌బ‌డ‌తాయి, నిల‌బ‌డితే సామ్రాజ్యాలు సాగిల‌ప‌డ‌తాయి, వాడి పొగ‌రు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీక‌ట్ల‌ను చీల్చే మండుటెండ‌, వాడు భూత‌ల్లి చ‌నుబాలు తాగిన మ‌న్నెం ముద్దు బిడ్డ‌, నా త‌మ్ముడు గోండ్రు బెబ్బులి కొమురం భీం అంటూ ఎన్టీఆర్ పాత్రను ప‌రిచ‌యం చేశారు. నిజంగానే ఎన్టీఆర్ ను చూస్తుంటే గర్జించే సింహంలాగనే వున్నాడు. మరి ఈ వీడియో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

బాహుబ‌లి సినిమాతో చ‌రిత్ర‌లు సృష్టించిన రాజ‌మౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిస్తున్న సినిమా రౌద్రం ర‌ణం రుధిరం. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 1 =