ఒకపక్క కరోనా వల్ల ఇప్పటికే ప్రజలు పలు ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క భారీ వర్షాలు ప్రజలకు పెద్ద సమస్యగా మారాయి. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని ఎన్నో ప్రాంతాలు నీట మునిగి లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇక కేసీఆర్ పిలుపు మేరకు తెలుగు ఇండస్ట్రీ అంతా కదలివచ్చింది. మన తెలుగు హీరోలు అందరూ ముందుకొచ్చి తమకు తోచినంత సాయం చేశారు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో మన బాహుబలి కూడా చేరిపోయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితుల కోసం తన వంతు సాయం ప్రకటించారు. తెలంగాణ సీఎం సహాయనిధికి కోటిన్నర రూపాయల విరాళం అందించాడు. అలానే బాధితులకి తమకు చేతనైన రీతిలో సహాయం చేయాల్సిందిగా తన అభిమానులకి పిలుపునిచ్చారు ప్రభాస్. కరోనా క్రైసిస్ కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభాస్ 4 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాగా ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నేడు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విక్రమాధిత్యగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమా చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: