అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. గత ఏడాది సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, సుబ్బరాజు, ప్రగతి, నాజర్, ఈశ్వరీరావు, అన్నపూర్ణమ్మ, వై విజయ కీలక పాత్రల్లో నటించిన ఎఫ్2 మూవీని కుటుంబసమేతంగా అందరూ ఎంజాయ్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా మరో అరుదైన అవార్డును సొంతం చేసుకుంది. 51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ-2020)వేడుకల్లో భాగంగా .. ఫీచర్ ఫిలిం కేటగిరిలో ఎఫ్2కు జాతీయ అవార్డు లభించింది. అంతేకాదు ఈ అవార్డు సాధించిన ఏకైన తెలుగు సినిమాగా ఎఫ్2 నిలవడం గొప్ప విషయం.
#F2 #FunAndFrustration and Director @AnilRavipudi win awards in prestigious Indian Panorama for 2019. #F2 is the only film from Telugu.
Congratulations to @AnilRavipudi and Team #F2@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisisDSP @SVC_official pic.twitter.com/HHYxX9bm8o
— Sri Venkateswara Creations (@SVC_official) October 21, 2020
మొత్తానికి గత ఏడాది పొంగల్ కి, ఈ ఏడాది పొంగల్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి మంచి ఫామ్ లో వున్నాడు అనిల్ రావిపూడి. మొదటి నుండి కామెడీకి పెద్ద పీట వేసి సినిమాలు తీస్తుంటాడు అనిల్. ఇక ఇప్పుడు ఎఫ్2 సీక్వెల్ ఎఫ్ 3 ను కూడా లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఎఫ్ 3 ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు జనవరి 2021 నుంచి ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ లోపు వరుణ్, వెంకీ సినిమాలు కూడా పూర్తవుతాయి. ఆ తర్వాత ఎలాగూ అనిల్ తక్కువ టైంలోనే సినిమాను పూర్తి చేస్తాడు కాబట్టి.. 5 నెలల్లోనే షూటింగ్ ను కంప్లీట్ చేసి వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నట్టు సమాచారం. మరి ఈ సీక్వెల్ ఎన్ని అవార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























