షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం లో నాని హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సుమారు 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “టక్ జగదీష్ ” మూవీ కరోనా కారణం గా షూటింగ్ వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Jagadish joins
Tuck begins 🎥 #TuckJagadish pic.twitter.com/3QezrZsNfH— Nani (@NameisNani) October 7, 2020
“టక్ జగదీష్ “మూవీ షూటింగ్ 6 నెలల తరువాత నిన్న హైదరాబాద్ లో పునః ప్రారంభం అయ్యింది. షూటింగ్ ప్రారంభం అయిన విషయాన్ని హీరో నాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “జగదీష్ జాయిన్ అయ్యాడు , టక్ మొదలైంది “అంటూ నాని ట్వీట్ చేశారు. ఈ మూవీ తరువాత రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో “శ్యామ్ సింగ రాయ్ “, “బ్రోచేవారెవరురా “మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: