బిగ్ బాస్ 4 .. అభిజిత్ ట్రిక్ తో హారిక కంటతడి

Harika Gets Emotional With Abijeet Trick In Bigg Boss 4 Show

బిగ్ బాస్ హౌస్ లో 31వ రోజు… మొన్న రాత్రి బీబీ హోటల్ టాస్క్ నిన్న రాత్రి కూడా కొనసాగింది. కామెడీ గా ఒకరి మీద ఒకరు పంచ్ లు వేసుకోవడంనుండి మొదలైన‌ టాస్క్‌ కాస్త సీరియస్‌గా మారింది. ఇక మొన్న జరిగినట్టే రిచ్ పీపుల్స్ సర్వీస్ అడగడం… హోటల్ స్టాఫ్ వారికి ఏదో ఒక కౌంటర్ వేస్తూ ఫుడ్ ఇవ్వడం జరిగింది. అయితే అవినాష్ సీక్రెట్ టాస్క్ లో భాగంగా రైస్ లో పిన్ పెట్టడం… మటన్ కర్రీ లో సాల్ట్ ఎక్కువ అవడం.. దానితో రిచ్ పీపుల్స్ హోటల్ స్టాఫ్ కు మాత్రం టిప్ ఇవ్వడానికి నిరాకరించారు. వారి చేష్టలు హోటల్‌ సిబ్బందికి కోపం తెప్పిస్తున్నప్పటికీ ఓపికతో అడిగిన పనులన్నీ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బీబీ హోటల్ టాస్క్ కాస్త.. ఫిజికల్ టాస్క్ లాగా అయింది. ఇక టిప్‌ కావాలంటే తన బెడ్‌ను రెండు నిమిషాల్లో సర్ధాలని హారిక సూచించగా..నోయల్‌ ఆ పనిచేశాడు. దీంతో నోయల్‌కు 2500 టిప్ ఇచ్చింది హారిక. రాజశేఖర్ మాస్టర్‌కు 100 సార్లు స్విమ్మింగ్‌ పూల్‌లో దూకాలని టాస్క్‌ ఇచ్చారు. టాస్క్‌ని విజయవంతంగా కంప్లీట్‌ చేసిన మాస్టర్‌.. స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి బయటకు వచ్చి కిందపడిపోయాడు. రాజశేఖర్‌ మాస్టర్‌ హార్డ్‌వర్క్‌ చూసి 3000 రూపాయల టిప్‌ ఇచ్చాడు మెహబూబ్‌. ఇక అఖిల్‌కి 150 పుష్అప్‌లు చేయాలని టాస్క్ ఇచ్చారు గెస్ట్‌లు.. అయితే అఖిల్ అతి కష్టం మీద 75 మాత్రమే తీయగలిగాడు. ఆ తరువాత అభిజిత్‌తో 20 కేజీలు ఎత్తించి 59 పుష్ అప్‌లు తీయించారు. అభి కి సోహైల్‌ 1000 రూపాయల టిప్పు ఇచ్చాడు. ఇక రిచ్ పీపుల్స్ ఇస్తున్న టాస్క్ లు చూసి సుజాత ఏడుస్తూ వీళ్లను చూస్తుంటే భయంగా ఉంది అంటూ బాధపడింది. లాస్య ఆమెను ఓదార్చింది.

ఆ తర్వాత తనకు సర్వీస్‌ సరిగా అందించడంలేదని మెహబూబ్‌ అనడంతో రిచ్‌మెన్లు అబద్దాలు ఆడుతున్నారని అవినాష్‌ అనగా మెహబూబ్‌ సీరియస్‌ అయ్యాడు. దీనితో మెహబూబ్ అభ్యంతరమైన పదజాలం వాడగా.. అఖిల్‌ మెహబూబ్‌పై సీరియస్ అయ్యాడు. మాటలు కంట్రోల్‌ పెట్టుకోవాలని, ఒక లెవల్‌ దాటి మాట్లాడొద్దంటూ హెచ్చరించాడు. అక్కడ ఇద్దరికీ చిన్న గొడవ అయింది. అవినాష్ కూడా రౌడీయిజం చూపించుకోవాలంటే ఊర్లో చూపించుకో అంటూ గట్టిగానే మాట్లాడాడు. తర్వాత సోహైల్ అలా అనకుండా ఉండాల్సింది అని మెహబూబ్ కు చెప్పడంతో అప్పుడు మెహబూబ్ అందరికీ సారీ చెప్పాడు.

ఇక హోటల్‌ సిబ్బందికి ఒక స్టార్‌ ఇవ్వాలని హారిక చెప్పడంతో అప్పటికే 5 స్టార్లను దొంగిలించిన అభి‌.. హారికకు ఈ విషయం చెప్పాడు. అయితే తన స్టార్‌ తనకు ఇస్తే తిరిగి ఇస్తానని హారిక చెప్పగా.. అభిజిత్‌ తెలివిగా 5 స్టార్లను తన చేతిలో పెట్టి..తిరిగి తీసుకున్నాడు. దీంతో 5 స్టార్లు అతిథులు ఇచ్చినట్లే అని అభి చెప్పగా.. లేదు లేదు నేను ఒక్కటే స్టార్‌ ఇచ్చానని హారిక చెప్పింది. ఇక ఇదే విషయం పై రేపటి ఎపిసోడ్ లో పెద్ద రచ్చ జరిగేలా కనిపిస్తుంది. మరి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ గా ఉన్న వీరిద్దరి మధ్య ఈ విషయం వల్ల ఏమన్నా గ్యాప్ పెరుగుతుందా.. లేకపోతే గేమ్ ను గేమ్ లాగే తీసుకుంటారా చూద్దాం రేపు ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 3 =