సౌత్ vs నార్త్ అన్నట్టు నేను మాట్లాడలేదు

Shruti Haasan rubbishes all the rumours

2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2017 లో కోలీవుడ్‌లో ‘సింగం 3’, టాలీవుడ్‌లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్‌లో ‘బెహెన్‌ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. మళ్లీ గ్యాప్ తర్వాత శృతి మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా శృతి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూపై పలు విమర్శలు తలెత్తాయి. హిందీ పరిశ్రమ గురించి ఎక్కువ మాట్లాడిందన్న ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ వార్తలపై శృతి హాసన్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. నేను ఇచ్చిన ఇంటర్వ్యూను తప్పుగా స్ప్రెడ్ చేస్తున్నారని.. రేసు గుర్రం, గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాల‌లో న‌టించినందుకు నేను గర్వం‌గా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారితో నేను న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం నా జీవితాన్నే మార్చేసింద‌ని శృతి పేర్కొంది. అంతేకాదు తెలుగు మరియు సౌత్ ఇండియన్ ఫిల్మ్ నా గుండెల్లో భాగం అని, ఆ ఇంటర్వ్యూ లో కేవలం హిందీ సినిమా కోసం చెప్పానే కానీ ఎక్కడా తెలుగు వర్సెస్ హిందీ అన్నట్టుగా చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది శృతి.

 

 

కాగా ప్రస్తుతం శృతి హాసన్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న “క్రాక్ ” మూవీలో నటిస్తుంది. దీనితోపాటు ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటించనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.