గత కొద్ది రోజులుగా కరోనాతో ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక బాలు ఆరోగ్యంపై తనయుడు ఎస్పీ చరణ్ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్న సంగతి కూడా విదితమే. ఈనేపథ్యంలోనే సోమవారం గుడ్ న్యూస్ రాబోతుందని చరణ్ రెండు రోజుల క్రితం తెలియజేశాడు. ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ ఏంటో కూడా చెప్పేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాన్నగారికి కరోనా నెగిటివ్ అని వచ్చింది. కరోనా పరీక్షలు నిర్వహించిన ఆస్పత్రి వైద్యులు నాకు సమాచారం ఇచ్చారు. ఇంతకు ముందుతో పోలిస్తే నాన్న ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గానే ఉంది. అయితే వెంటిలేటర్ తొలగిస్తారని భావించాం కానీ ఇంకా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉండటంతో అది సాధ్యం కాలేదు. వెంటిలేటర్ తొలగింపుపై కాస్త సమయం పడుతుంది. నాన్నగారి కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాన్న ఆరోగ్యం గురించి వారాంతంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోయాను క్షమించండి. నాన్న ప్రస్తుతం ఐపాడ్‌లో క్రికెట్, టెన్నిస్ కూడా చూస్తూ ఆస్వాదిస్తున్నారు అని తెలిపాడు.
View this post on Instagram
కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుండి బాలుకి చికిత్స పొందుతూనే ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: