ప్రేమ కథా చిత్రాలు ఇష్టం -అదితి రావు హైదరి

Feel Good Love Entertainers Are Always My Favorite Says Actress Aditi Rao Hydari

మలయాళ , తమిళ , హిందీ భాష ల చిత్ర నటి అదితి రావు హైదరి ని , దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి సక్సెస్ ఫుల్ “సమ్మోహనం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం చేశారు. అదితి రావు సైన్స్ ఫిక్షన్ “అంతరిక్షం 9000 KMPH ” మూవీ తో ప్రేక్షకులను అలరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ లో హీరో నాని కి జోడీగా సాహెబా పాత్రలో అదితి రావు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా అదితి రావు మీడియా తో సమావేశమయ్యారు. అదితి రావు మాట్లాడుతూ .. కథ నచ్చడంతో “V” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాననీ , పాత్ర నిడివి తనకు ముఖ్యం కాదనీ , పాత్ర ప్రాధాన్యతను పరిగణన లో తీసుకుని మూవీస్ అంగీకరిస్తాననీ , హీరో నాని కి జోడీగా నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అనీ , సాహెబా పాత్రలోనటించిన తనను కొంతమంది నటీనటులు ప్రశంసించారనీ , తనకు ప్రేమ కథా చిత్రాలు అంటే ఇష్టమనీ , అన్ని రకాల పాత్రలలో నటించాలని ఉందనీ , ప్రస్తుతం 3 హిందీ , 2 తమిళ , ఒక తెలుగు మూవీస్ లో నటిస్తున్నాననీ అదితి రావు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =