దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో గుర్తింపు పొంది నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. మోడల్ నభా నటేష్ భరత నాట్యం లో ట్రైనింగ్ పొందారు. స్కూల్ , కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని నభా నటేష్ డ్యాన్స్ చేయడమే కాకుండా కొరియోగ్రఫీ కూడా చేశారు. నభా నటేష్ ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా రూపొందుతున్న “సోలో బ్రతుకే సో బెటర్ “, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న “అల్లుడు అదుర్స్ “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నభా నటేష్ తన అందమైన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. నభా నటేష్ మనసు దోచుకొనేవాడు ఎలా ఉండాలో ఆమె మాటల్లోనే .. ఎదుటి వ్యక్తి లో తాను మొదట చూసేది హాస్య చతురత అనీ , ఎదుటి వారి ఆలోచనలు అర్ధం చేసుకొనే వారంటే ఇష్టమనీ , బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టమనీ, చిన్నప్పటినుండీ షారుఖ్ సినిమాలు చూస్తూ ఆయనపై అభిమానం పెంచుకున్నాననీ , షారుఖ్ నటించిన “కుచ్ కుచ్ హోతా హై” మూవీ అనేకసార్లు చూశాననీ , స్కూల్ , కాలేజ్ వయసులో ఆకర్హణ సహజమే కదా అని నభా నటేష్ అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: