ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నందిత తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం నందిత ‘ఐపీసీ 376’ అనే సినిమాలో నటిస్తుంది. రామ్ కుమార్ సుబ్బరాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రభాకర్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో వాటర్ లో ఫైట్ సీక్వెన్స్ ఉంది.. దానికి చాలా కష్టపడ్డాం అని తెలుపుతుంది నందిత. ఈ సీక్వెన్స్ కోసం చెన్నై లోని కళ్యాణి టెంపుల్ దగ్గర ఉన్న కెనాల్ దగ్గరకు వెళ్ళాం. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం సీనియర్ ఫైట్ మాస్టర్ నే పెట్టుకున్నాం అయితే నేను మాత్రం కాన్ఫిడెంట్ గా లేను అందుకే షూటింగ్ నుండి బెంగుళూరు వచ్చేసా.. అక్కడే రెండు వారాలు ఉండి స్విమ్మింగ్ నేర్చుకున్నా. ముందు వాటర్లో దిగాలంటే చాలా భయపడ్డాను.. ఏడ్చినంత పని చేసాను.. నా ట్రైనర్ మాత్రం నన్ను పూల్ లో నెట్టేసేవారు.. చాలా నీళ్లు కూడా తాగేసాను అప్పుడు. ఓ నాలుగు రోజుల తర్వాత కొంచం భయం అనేది పోయింది.. రెండువారాల్లో కొంచం నేర్చుకున్నాను.. ఎంత స్విమ్ చేయడం వచ్చినా కానీ వాటర్ లో ఫైట్ సీక్వెన్స్ అంటే మాత్రం చాలా కష్టం.. అని నందితా చెప్పింది.
కాగా బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావలి కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాను హాల్ బ్యానర్ పై అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ లు కలిసి నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: