కరోనా వల్ల సినిమా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. ఇక పెద్ద సినిమాలు ఎలాగూ థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. అయితే కొన్ని కొన్ని చిన్న సినిమాలకు మాత్రం ఈ కరోనా కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. నిజంగా థియేటర్స్ లో కనుక రిలీజ్ అయితే అంత టాక్ రీచ్ కాకపోయేవేమో. ఆ రకంగా కొన్నిసినిమాలకు మాత్రం లాక్ డౌన్ కలిసొచ్చింది. ఇక ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ గురించి మాట్లాడుతూ వాటిని ఐపీల్ తో పోల్చాడు ఉమా మహేశ్వరుడు అదేనండీ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ కథానాయకుడు సత్యదేవ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సత్య దేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా రీసెంట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సత్యదేవ్ నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ‘ది తెలుగుఫిలింనగర్.కమ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయనను ఈ పరిస్థితుల్లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కొత్త సినిమాలకు కొత్త మార్గం అని అనుకుంటున్నారా అని అడుగగా… దానికి ఆయన నేను అలా అనుకోవట్లేదు.. నిజానికి ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ 2022 కి అలా బూమ్ లోకి రావాల్సింది కానీ కరోనా వల్ల కాస్త ముందుగానే ఎక్కువ పాపులర్ అయ్యాయి.. చెప్పాలంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అనేవి ఐపీఎల్ లాంటివి.. థియేటర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ లాంటివి అని చెప్పాడు. రెండూ బిజినెస్సే.. దేని ఇంపార్టెన్స్ దానిదే.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా గుడ్.. ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది.. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కు వస్తుంది అని తెలిపాడు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ మన లైఫ్ లో భాగమైపోయాయి అది ఒప్పుకోవాల్సిన విషయం అని పేర్కొన్నాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సత్య దేవ్. ప్రస్తుతం కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమా తెలుగు లో రీమేక్ లో నటించనున్నాడు. ఈ సినిమాలో సత్య దేవ్ తమన్నా తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: