పైన ఫొటోలో ఉన్న చిన్నారిని చూసారా…? ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఎవరో కాదు తెలుగులో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి వరుస విజయాలతో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని.. ఆమె ఉంటే చాలు సినిమా హిట్ కొట్టినట్టే అన్న రేంజ్ కు ఎదిగి… స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలుతుంది. కొంతమందికి హీరోయిన్స్ కు పెళ్ళైన తర్వాత సినిమా ఛాన్స్ లు తగ్గుతాయి.. కానీ ఈ హీరోయిన్ విషయంలో అది కూడా తప్పని రుజువైంది. పెళ్ళైన తర్వాత కూడా వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పటికే ఒక ఐడియా వచ్చినట్టుంది కదా. అవును ఆ చిన్నారి ఎవరో కాదో టాలీవుడ్ స్టార్ హీరోయిన్… అక్కినేని వారి కోడలు.. సమంత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏం మాయ చేసావే సినిమాతో తన నటనతో అందరినీ మాయ చేసి.. దూకుడు సినిమాతో దూకుడిని పెంచి… వరుస హిట్స్ తో దూసుకుపోతూ.. యూటర్న్ సినిమాతో మహిళా ప్రాధాన్యత సినెమాలకు యూ టర్న్ తీసుకొని.. ఇటీవల జాను సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జానుగా మిగిలిపోయిన హీరోయిన్ సమంత. మొదటినుండి విభిన్నమైన కథలతో.. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కి టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత.
నిజానికి ఏ హీరోయిన్ అయినా సినిమాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో పెళ్లి చేసుకుంటారు. కానీ సమంత మాత్రం స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. నాగచైతన్యని ప్రేమించి పెళ్ళాడింది సమంత. 2017లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగింది ఇక పెళ్ళయిన తర్వాత కూడా స్టార్ హీరోయిన్ గానే రాణిస్తుంది.
తన కెరీర్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. 2013లో రేవతి తర్వాత ఒకేసారి ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటి సమంత.
సమంత సామాజిక సేవలోను ముందుంటుంది. ‘ప్రత్యూష సపోర్ట్’ అనే పేరుతో సమంత ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నడిపిస్తోంది. ప్రత్యూష సపోర్టు ద్వారా ఎంతోమంది పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తుంది.
ఇప్పుడు పలు తెలుగు, తమిళ్ సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక మరోవైపు వెబ్ సిరీస్ లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఫ్యామిలీ మాన్ 2 లో ఒక వినూత్నమైన పాత్ర పోషిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: