లాక్ డౌన్ లో చాలామంది సెలబ్రిటీస్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది వంట ప్రయోగాలు చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు. వర్కౌట్స్ చేస్తున్నారు. మరోపక్క కొత్త కొత్త మేకోవర్ లు ట్రై చేస్తున్నారు. కొంతమంది గడ్డాలు, మీసాలు పెంచేసి గుర్తుపట్టకుండా తయారవుతున్నారు. సినిమాలో లుక్ కోసం కొంతమంది అలా మైంటైన్ చేసినా కొంతమంది మాత్రం గడ్డం, మీసం లుక్ లోనుండి బయటికి రావడం లేదు. ఇక ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి కూడా కొత్త లుక్ లోకి మారిపోయాడు. నిజానికి ఆచార్య సినిమాలో చిరు మంచి మీసకట్టుతో ఉంటారు. అయితే ఇప్పుడు ఫుల్ క్లీన్ షేవ్ తో లుక్ నే మార్చేశారు. అంతేకాదు తన ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ మేకోవర్ మూడ్స్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఇక చిరు కొత్త లుక్ పై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 20 ఇయర్స్ బ్యాక్ కి వెళ్లిపోయారు.. కొత్త లుక్ సూపర్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: