‘సంజయ్ దత్’ బర్త్ డే కి ‘కె.జి.యఫ్2’ టీమ్ సర్ప్రైజ్..?

KGF2 Team Plans A Special Surprise To Audience On Sanjay Dutt Birthday

కె.జి.యఫ్ హిట్ సంచలన విజయం దక్కించుకోవడంతో దాని సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎంత ఎదురు చూస్తున్నారో అంత వెనక్కి వెళ్తుంది. మరోపక్క దర్శక నిర్మాతలు మాత్రం తొందరలోనే సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తామని చెపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ అధీర పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 29 న సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో ఆరోజు ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి టీజర్ ఆ లేకపోతే సంజయ్ దత్ కు సంబంధించిన అప్ డేటే ఏదైనా ఇస్తారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.