ఆరోగ్యమే మహాభాగ్యం , సంతోషమే సంపద – రాశీఖన్నా

Actress Raashi khanna Stresses On The Importance Of Healthy Lifestyle In Her Recent Post On Social Media

పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో బుక్ రీడింగ్ , తమిళ భాష ప్రాక్టీస్ చేస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ రాశీఖన్నా టైమ్ పాస్ చేస్తున్నారు. తమిళ స్టార్ సూర్య హీరోగా రూపొందనున్న “అరువా ” తమిళ మూవీ లో హీరోయిన్ గా రాశీఖన్నా ఎంపిక అయ్యారు.

అసలుసిసలైన ఆనందం గుర్తించండి , నిజమైన ఐశ్వర్యం కనిపెట్టండి అంటూ రాశిఖన్నా హిత బోధ చేస్తున్నారు. ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితులు చూశాకైనా ప్రతీ ఒక్కరూ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోమని, సరికొత్త జీవన సరళిని అలవర్చుకోవాలని చెప్పారు. సంపాదనలో సంతోషం ఉందని భ్రమపడ్డామని, ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను నాశనం చేసుకున్నామని , ప్రస్తుత కరోనా పరిస్థితులను ఒక హెచ్చరిక గా భావించి అసలైన ఆనందం , ఐశ్వర్యం ఎక్కడ ఉన్నాయో గుర్తించాలని , ఆరోగ్యమే అత్యంత గొప్ప సంపద అని , సంతోషమే ఐశ్వర్యమని , మన ప్రేమాభిమానాలు అందరితో పంచుకొనడమే మానవత్వం అని రాశీఖన్నా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here