ట్యాలెంటే ముఖ్యం

We Should Rely On Our Ourselves To Be Successful In Our Career Says Actress Keerthy Suresh

తెలుగు ,తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు మూవీస్ లో బిజీగా ఉన్న కీర్తి లాక్ డౌన్ సమయంలో యోగా , వయోలిన్ ప్రాక్టీస్ , సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ , తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో బంధుప్రీతి, ఆధిపత్య ధోరణి వల్లే హీరో సుశాంత్ సింగ్ బలవన్మరణానికి పాల్పడ్డారని పలువురు సినీ ప్రముఖులు ఆరోపించిన నేపథ్యంలో కీర్తి స్పందించారు.

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ … ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ప్రేక్షకాదరణ పొందక పోతే ఎవరూ రాణించలేరని , చిత్ర పరిశ్రమలో ప్రతిభ నే కొలమానంగా భావిస్తారని , ట్యాలెంట్ ఉంటే ఏదో ఒక రోజు విజయం వరిస్తుందని, తాను సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చినా ఏ నాడూ తన పేరెంట్స్ సహాయాన్ని కోరలేదని , తన ట్యాలెంట్ తోనే ఈ స్థాయి కి చేరుకున్నానని , సుశాంత్ ఆత్మహత్య
తనను షాక్ కు గురిచేసిందని , డిప్రెషన్ తో ప్రాణాలు తీసుకొనడం చాలా బాధాకరం అని , అందరూ నెగటివిటీ కి దూరం గా ఉండాలని , మన ఆలోచనలకంటే మనోస్థైర్యమే బలమైందని , పని , డబ్బు గురించి ఆలోచించడం మానుకుని జీవితాన్ని ఆనందింపజేసే విషయాలపై దృష్టి పెట్టాలని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here