రూమర్స్ పై ఫన్నీ కౌంటర్ .. పనిలేక చచ్చిపోతున్నా చెప్పండి..!

Tollywood Actress Rakul Preet Singh Once Again Quashes The Rumours About Her Upcoming Movie With A Witty Counter

సోషల్ మీడియాలో హీరో హీరోయిన్స్ పై పలు గాసిప్స్ రావడం కామన్ థింగే. కొంతమంది వాటిని పట్టించుకుంటే కొంతమంది మాత్రం లైట్ తీసుకుంటారు. అయితే ఇక్కడ రకుల్ మాత్రం తనపై వచ్చిన తప్పుడు కథనాలపై కామెడీగా స్పందిస్తూనే.. కౌంటర్ యిచ్చేసింది. నిజానికి రకుల్ కి ఇదేం కొత్త కాదు. ఇప్పటికే తనపై నెగిటివ్ కామెంట్ చేసినోళ్లకి స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది. ఇక తాజాగా తనపై వచ్చిన రూమర్ ఏంటంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్ హీరోగా తెరకెక్కుతున్న అయ‌ల‌న్ అనే సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది ఇన్ని రోజులు. ఇక ఎలాగూ షూటింగ్స్ కు పర్మిషన్స్ వున్నాయి కాబట్టి వాళ్ళు కూడా షూటింగ్ మొదలుపెట్టాలని చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే.. కరోనా వల్ల ర‌కుల్ ఇప్పుడు షూటింగ్‌కు రాన‌ని అంటుంద‌ని, అందుకోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌రో హీరోయిన్‌ను వెతుక్కుంటున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఈ వార్తలపై స్పందిస్తూ రకుల్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ”బాధ్యత యుతమైన జర్నలిజం ఎప్పుడు వస్తుంది, మీడియా నిజాలను తెలుసుకొనే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంది, కొన్ని హిట్స్ కోసం మరీ దిగజారిపోతున్నారు. అసలు ఎవరు ఎక్కడ షూటింగ్స్ జరుపుతున్నారో నాకు చెప్పండి. ఇక్కడ పనిలేక చచ్చిపోతున్నాం” అని పోస్ట్ చేశారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + four =