తెలుగునాట యువతరాన్ని విశేషంగా అలరిస్తున్న యువ కథానాయకులుగా నితిన్, రామ్, విజయ్ దేవరకొండకి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరి చిత్రాలు తెలుగువారినే కాకుండా.. హిందీ ప్రేక్షకులను కూడా అనువాద రూపంలో విశేషంగా అలరిస్తున్నాయి. కాగా, తక్కువ గ్యాప్‌లోనే యూట్యూబ్‌లో విడుదలైన ఈ ముగ్గురి సినిమాల హిందీ వెర్షన్స్.. తాజాగా 100 మిలియన్ల క్లబ్‌లో చేరడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నితిన్ కథానాయకుడిగా నటించిన ‘శ్రీనివాస కళ్యాణం’(2018) హిందీ వెర్షన్‌ని గత సెప్టెంబర్ నెలలో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా.. రీసెంట్‌గా ఈ సినిమా 100 మిలియన్ వ్యూస్ క్లబ్‌లో చేరింది. అలాగే, విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’(2019) హిందీ వెర్షన్‌ని జనవరి నెలలో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా ఇటీవల 100 మిలియన్ క్లబ్‌లో చేరిపోయింది. ఇక రామ్ కెరీర్ బెస్ట్ హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’(2019)ని కూడా ఈ ఫిబ్రవరి నెలలో హిందీ అనువాద రూపంలో అప్‌లోడ్ చేయగా రీసెంట్‌గా ఈ క్లబ్‌లో జాయిన్ అయింది.



మొత్తమ్మీద.. నితిన్, రామ్, విజయ్ దేవరకొండ నటించిన ఈ మూడు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్.. హిందీ ఆడియన్స్‌ని కూడా మెప్పిస్తూ తక్కువ గ్యాప్‌లోనే సెంచరీ క్లబ్‌లో చేరడం వార్తల్లో నిలిచే అంశమనే చెప్పాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: