సాయితేజ్ ‘సుప్రీమ్’కి 4 ఏళ్ళు

Sai Tej Action Comedy Entertainer Supreme Completes 4 Years

యువ క‌థానాయ‌కుడు సాయి తేజ్ హీరోగా ప‌లు మాస్ ఎంట‌ర్‌టైన‌ర్స్ తెర‌కెక్కాయి. వాటిలో ‘సుప్రీమ్’ ఒకటి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇందులో తేజ్‌ సరసన రాశి ఖన్నా నాయికగా నటించగా రాజేంద్రప్రసాద్, సాయికుమార్, మురళీమోహన్, మాస్ట‌ర్ మైఖేల్ గాంధీ, రవికిషన్, కబీర్ దుహాన్ సింగ్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, అలీ, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సురేఖావాణి, మీనా, రజిత ముఖ్య పాత్రలు పోషించారు. ‘ప‌టాస్’ ఫేమ్ శ్రుతి సోది ప్రత్యేక గీతంలో మెరిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామజోగయ్య శాస్త్రి, శ్యామ్ కాసర్ల గీతరచన చేయగా.. సాయికార్తీక్ స్వరాలు సమకూర్చాడు. “అందం హిందోళం” (మెగాస్టార్ చిరంజీవి ‘యముడికి మొగుడు’లోని పాట‌కి రీమిక్స్ – వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం), “బెల్లం శ్రీదేవి”, “టాక్సీవాలా”, “ఛలో ఛలో”, “ఆంజనేయుడు నీవాడు”.. వంటి పాటలు అభిమానులను అలరించాయి. 2016 మే 5న విడుదలై విజయం సాధించిన ‘సుప్రీమ్’.. నేటితో 4 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fourteen =