న‌ట‌సింహ బాలకృష్ణ ‘సింహా’కు 10 ఏళ్ళు

Nandamuri Balakrishna Box Office Sensation Simha Completes 10 Years

“చూడు.. ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. మాడిపోతావ్”.. అంటూ డాక్టర్ నరసింహగా న‌టసింహ నంద‌మూరి బాలకృష్ణ తన నటవిశ్వరూపాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ చిత్రం ‘సింహా’. ఇందులో బాల‌య్య ప‌లికిన ప్ర‌తీ డైలాగ్ అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే. మ‌రీ ముఖ్యంగా.. జ‌నాల జేజేలందుకునేలా బాలయ్యను స‌రికొత్త కోణంలో ఆవిష్క‌రించారు చిత్ర ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను. బాలయ్య ద్విపాత్రాభినయం పోషించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార, స్నేహా ఉల్లాల్, న‌మిత నాయిక‌లుగా నటించారు. కె.ఆర్.విజయ, రెహమాన్, సాయికుమార్, ఆదిత్యమీనన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, వేణు మాధవ్, చలపతిరావు, కృష్ణభగవాన్, ఝాన్సీ ముఖ్య పాత్రలు పోషించారు. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి, చంద్రబోస్, భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చగా చక్రి జ‌న‌రంజ‌క బాణీలు అందించారు. “సింహమంటి చిన్నోడే”, “బంగారుకొండ”, “కనులార చూదము”, “జానకి జానకి”, “ఒరబ్బా”.. ఇలా ఇందులోని అన్ని పాటలు విశేషాద‌ర‌ణ పొందాయి. ఉత్తమ నటుడు(బాలకృష్ణ), ఉత్తమ హాస్యనటి(ఝాన్సీ), ఉత్తమ సంగీతదర్శకుడు(చక్రి) విభాగాల్లో ‘నంది’ పురస్కారాలను కైవసం చేసుకోవడమే కాకుండా.. పలు ప్రాంతీయ పురస్కారాలను కూడా సొంతం చేసుకుందీ చిత్రం. 2010 ఏప్రిల్ 30న విడుదలై ఘనవిజయం సాధించిన ‘సింహా’.. నేటితో 10 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

‘సింహా’ – కొన్ని విశేషాలు:

* బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రమిది. అలాగే న‌మిత‌, స్నేహా ఉల్లాల్ కాంబినేష‌న్‌లోనూ బాల‌య్య‌కిదే ఫస్ట్ మూవీ కావ‌డం విశేషం.
* బాలయ్య, బోయపాటి కలయికలో వచ్చిన మొద‌టి సినిమా ఇది. ఆ త‌రువాత వ‌చ్చిన ‘లెజెండ్’తో మ‌రో భారీ విజ‌యాన్ని త‌మ ఖాతాలో వేసుకుందీ ద్వ‌యం.
* బాలయ్య, సంగీత దర్శకుడు చక్రి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రమిదే. అంతేకాదు.. ఈ సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా చక్రి తన కెరీర్‌లో తొలిసారి ‘నంది’ పురస్కారం అందుకోవడం విశేషం.
* 2010లో రిలీజైన తెలుగు చిత్రాల్లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన సినిమా ‘సింహా’.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here