నా కోసం స్క్రిప్ట్ రెడీ చెయ్.. అప్పటి వరకూ ఆగలేను..!

Actor Vijay Deverakonda Requests Arjun Reddy Director Sandeep Reddy Vanga To Write A New Movie Script For Him
Actor Vijay Deverakonda Requests Arjun Reddy Director Sandeep Reddy Vanga To Write A New Movie Script For Him

విజయ్ దేవరకొండ సినీ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే అర్జున్ రెడ్డి కి ముందు, అర్జున్ రెడ్డి కి తర్వాత…అని చెప్పొచ్చు. ఎందుకంటే అర్జున్ రెడ్డి కంటే ముందు విజయ్ పలు సినిమాల్లో నటించాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో ఏదో కనిపించి కనిపించని పాత్రలో కనపడి.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ కొట్టి హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిందే ‘అర్జున్ రెడ్డి’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు.. కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఇక విజయ్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. యూత్ లో సూపర్ క్రేజ్.. ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు. ఇక ఆ సినిమా తర్వాత విజయ్ కెరీర్ ను చూస్తూనే వున్నాం. సెన్సేషన్ స్టార్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. అర్జున్ రెడ్డి తర్వాత కూడా పలు సూపర్ హిట్స్ అందుకోవడంతో టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా విజయ్ సినిమాతో చేయడానికి క్యూ కట్టారు.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి సందీప్ వంగ ను స్క్రిప్ట్ సిద్ధం చేయమని కోరుతున్నాడు విజయ్. అసలు సంగతేంటంటే.. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల కోసం `ది దేవ‌ర‌కొండ ఫౌండేష‌న్‌` ద్వారా స‌హాయం చేయ‌డం మొద‌లు పెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిపై విజ‌య్‌ని అభినందిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఆసక్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టాడు సందీప్ వంగ. దీనికి వెంట‌నే స్పందించిన విజ‌య్ దేవ‌రకొండ నిన్ను మిస్స‌వుతున్నా వంగ.. ప్రస్తుతం ఎలాగూ లాక్ డౌన్ కాబట్టి ఈ టైం లో తన కోసం ఓ రెండు మూడు స్క్రిప్ట్స్ రాయమని రెండేళ్ల వ‌ర‌కు ఎదురుచూడ‌లేన‌ని ట్వీట్ చేశాడు. దీంతో రౌడీ ఫ్యాన్స్ మ‌ళ్లీ `అర్జున్‌రెడ్డి` కాంబినేష‌న్‌లో సినిమా రాబోతోందంటూ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మరి ఈ సారి రౌడీ హీరో కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో సందీప్ చూద్దాం.

 

ఇక అర్జున్‌ రెడ్డిని హిందీలో కూడా రీమేక్‌ చేసి అక్కడా సూపర్‌ హిట్‌ అందుకున్నాడు సందీప్ .ఆ సినిమా హిట్‌ అవ్వడంతో ఈయన హిందీలో వరుసగా సినిమాలు చేసేందుకు ఛాన్స్‌ దక్కించుకుంటున్నాడు. సందీప్‌ రెడ్డితో వరుసగా రెండు సినిమాలను నిర్మించేందుకు టీ సిరీస్‌ సంస్థ భారీ ఒప్పందం చేసుకుంది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఈయన తదుపరి చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + nine =