బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) మృతి చెందారు. గతకొద్దికాలంగా ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేశారు. కొన్ని నెలల క్రితం కోలుకున్నారు. అయితే మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీనితో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషయం చెందటంతో ఈ రోజు మరణించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారికంగా ప్రకటన చేసింది. ఇర్ఫాన్ ఖాన్ మృత దేహాన్ని ఆసుపత్రి సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇర్ఫాన్ ఖాన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఓ గొప్ప నటుడిని కోల్పోయామంటూ నటులు ట్వీట్లు చేశారు. ఇర్ఫాన్ ఖాన్ మృతి గురించి తెలుసుకున్నానని, ఇది చాలా విచారకర వార్త అని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సంతాపం వ్యక్తం చేశారు.
కాగా, నాలుగు రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) మృతి చెందిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆమె అంత్యక్రియలు జరగగా ఇర్ఫాన్ ఖాన్ వెళ్లలేకపోయారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తల్లి అంత్యక్రియలను చూశారు. ఈ సంఘటన ఇర్ఫాన్ ను మరీ కృంగదీసిందని.. దీనితో మరింత మనస్థాపానికి గురయ్యారని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. సుకాపా సిక్డర్ భార్య కాగా బాబిల్ మరియు అయాన్ అనే ఇద్దరు కుమారులు కలరు.
కాగా ఇర్ఫాన్ ఖాన్ 1988లో సలాం బాంబే చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన విభిన్నమైన నటనతో ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, మఖ్బూల్, లంచ్‌బాక్స్ సినిమాలు ఆయన కెరీర్‌లో మరిచిపోలేని సినిమాలుగా నిలిచాయి. బాలీవుడ్ తో పాటు ఆయన అనేక హాలీవుడ్ చిత్రాలలో నటించారు. ఇర్ఫాన్ 2011లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
ఇక టాలీవుడ్ నుండి కూడా పలువురు నటులు స్పందించి ఇర్ఫాన్ మృతిపై సంతాపం తెలియచేసారు.
The world of cinema has lost a crowned jewel. One of the most exceptional actors and the film industry will definitely miss the legend. May your soul rest in peace, Irrfan Khan ji. pic.twitter.com/qaBYTfr3xN
— Ram Charan (@AlwaysRamCharan) April 29, 2020
One of the finest actors of our country, Irfan khan. Sad to hear about him. What memorable characters he did. Will miss him on the screen but will cherish his movies. RIP #IrrfanKhan
— Vishnu Manchu (@iVishnuManchu) April 29, 2020
#RIPIrrfanKhan Always remembered & Forever missed.. 🙏🙏 pic.twitter.com/yBgTVEj05v
— Krish Jagarlamudi (@DirKrish) April 29, 2020
Deeply saddened to hear about Irrfan Khan.
Condolences to his family.
Cinema will miss you!🙏🏽#RIPIrrfanKhan
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) April 29, 2020
The Indian film industry has lost one of its best. As a huge fan of his, it’s truly heartbreaking to hear that Irrfan Khan is no more. May his soul RIP. #IrrfanKhan
— Allari Naresh (@allarinaresh) April 29, 2020
T 3516 – .. just getting news of the passing of Irfaan Khan .. this is a most disturbing and sad news .. 🙏
An incredible talent .. a gracious colleague .. a prolific contributor to the World of Cinema .. left us too soon .. creating a huge vacuum ..
Prayers and duas 🙏— Amitabh Bachchan (@SrBachchan) April 29, 2020
When we thought nothing could make us feel worse,this happened. I think I will refuse to believe you are no more by watching all your work time n again n again n again. I have known you that way n shall continue to know you that way for ever. You ARE the best we have #IrrfanKhan
— taapsee pannu (@taapsee) April 29, 2020
Goodbye sir …Thankyou for your beautiful art and magic 🖤 Thankyou for being you – will miss you always. May your soul rest in peace and may you find peace and light https://t.co/Gb22Cz2T60
— shruti haasan (@shrutihaasan) April 29, 2020
So sad that we have lost an actor par excellence and beyond that a lovely person @irrfank .you will always remain in our hearts sir. Strength to the family. RIP 💔
— Rakul Singh (@Rakulpreet) April 29, 2020
I have not even met you sir.
But this loss feels so personal.
Your work and love for the art has made you so close and dear to our hearts.
May your soul be in a much happier and peaceful place. #IrrfanKhan— Sai Pallavi (@Sai_Pallavi92) April 29, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: