దేవి ‘మ్యూజికల్’ క్లీనింగ్..!

Rock Star Devi Sri Prasad Aces The Real Man Challenge Like A Pro
Rock Star Devi Sri Prasad Aces The Real Man Challenge Like A Pro

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేసిన ప్రస్తుతం టాలీవుడ్ లో ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ జోరుగా నడుస్తుంది. ఈ ఛాలెంజ్ ఇప్పటివరకూ ఎంతో మంది కంప్లీట్ చేసి ‘రియల్ మ్యాన్’ అనిపించుకున్నారు. కొంతమంది ఈ ఛాలెంజ్ ను సీరియస్ గా తీసుకుంటే కొంతమంది లైట్ గా తీసుకున్నారు. అయితే చాలా మంది మాత్రం తమ ఛాలెంజ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో దేవి కూడా చేరిపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మ్యూజిక్ సెన్సేష‌న్ దేవి శ్రీ ప్రసాద్ బీ ది రియ‌ల్ మ్యాన్ ఛాలెంజ్‌ని స్వీక‌రించి వీడియో షేర్ చేశారు. తన మేనల్లు సుకుమార్ ఛాలెంజ్ ను గుర్తు చేయగా.. దేవి ఉలిక్కిపడి లేచి స్టార్ట్ చేస్తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఛాలెంజ్‌లో పాల్గొన్న ‌వారందరిని వీడియోలో చూపిస్తూ తాను కూడా ఇంటిని శుభ్ర‌ప‌రిచి… ఇక ఆమ్లేట్ కూడా వేసి త‌న త‌ల్లికి తినిపించాడు. చివ‌ర‌లో త‌న తండ్రి ఫోటోల‌ని తూడ్చి,చివ‌రికి త‌ల్లికి కాఫీ అందించాడు. ఈ వీడియోని ప్ర‌తి త‌ల్లికి అంకితం చేస్తున్న‌ట్టు పేర్కొన్నాడు. అయితే నార్మల్ గా కాకుండా ఇంట్రస్టింగ్ ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ తో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఛాలెంజ్‌ని అల్లు అర్జున్‌, కార్తి, య‌శ్‌, హ‌రీష్ శంక‌ర్ ల‌తో పాటు మోహ‌న్‌లాల్‌ని కూడా విసిరాడు. ఇదిలా ఉండగా త్వరలోనే ప్రజలకు విశేష సేవలందిస్తున్న పోలీసులు, పారిశుధ్య కార్మికుల కోసం ఓ పాటను విడుదల చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 8 =