కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా దానం చేస్తుంటారు కొంతమంది. అలాంటి వాళ్లలో మన సినీ సెలబ్రిటీస్ చాలా మందే ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. అగరం ఫౌండేషన్ ద్వారా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి కుటుంబం ఎంతో మందికి సేవలను అందిస్తుంది. ఇటీవల నూతన విద్యా విధానం గురించి సూర్య చెప్పిన అభిప్రాయం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా తెలిసిందే. దానికి పలువురి మద్దతు లభించింది కూడా. ఇక ఇదిలాఉండగా ఈ మధ్య సూర్య భార్య జ్యోతిక చేసిన వ్యాఖ్యలు కూడాచర్చంశనీయమైన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రజలు దేవాలయాలకు ఇచ్చినట్లే పాఠశాలలు ఆసుపత్రులకు విరాళాలు ఇవ్వమని.. దేవాలయాలకు ఇచ్చినట్టే పాఠశాలలు.. ఆస్పత్రులకు డొనేషన్లు ఎందుకు ఇవ్వరు? అలా ఇస్తే మరీ ఇంత పాతబడిన భవంతుల్లో స్కూల్స్.. ఆస్పత్రుల్ని చూడాల్సిన కర్మ ఏమిటి? అని సూటిగా ప్రశ్నించారు కథానాయిక జ్యోతిక. జ్యోతిక చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. ముఖ్యంగా హిందూ వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. కొందరు హిందూవాదులు రంగంలోకి దిగడంతో అది కాస్తా పెద్ద వివాదంగా మారింది.
తాజాగా జ్యోతిక భర్త.. స్టార్ హీరో సూర్య తన భార్యకు మద్ధతునిస్తూ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తమ కుటుంబం జ్యోతికతోనే ఉందని చెప్పారు. దేవాలయాల మాదిరిగానే పాఠశాలలు ఆసుపత్రులకు అధిక గౌరవం ఇవ్వమని జ్యోతిక ప్రజలను కోరారని సూర్య అన్నారు. వివేకానంద ఇతర ఆధ్యాత్మిక గురువుల సూచనను ప్రస్తావిస్తూ.. మనకు దేవుడి ప్రవచనాలు ఎంత ముఖ్యమో.. ఆధ్యాత్మిక గురువుల ప్రవచనాలు ప్రజలకు అంతే ఉపయుక్తమైనవని తెలిపారు. అలాంటి ఆలోచనలను వినని వారికి ఇది తెలియదని సూర్య అన్నారు. మరి సూర్య చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత సంచలనానికి దారి తీస్తాయో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: