కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇక ఈ లాక్ డౌన్ వల్ల పేదలకు, రోజువారీ కూలీలకు ఆర్థికంగా.. తినడానికి కూడా ఇబ్బందులు ఎదరువుతున్నాయి. ఇక వారికీ సాయం చేయడానికి పలువురు ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమంతటతాముగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పును ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం అందించారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్స్ , మాస్క్ లు పంపిణీ చేసారు. ఆయనతో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ విషయాన్ని మేయర్ తమ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ… దిల్ రాజు పై ప్రశంసలు కురిపించారు.
Appreciate @SVC_official Producer Dil Raju garu for his concern for our sanitation force who has come forward to sponsor sanitizers and protective face masks. Distributed few along with @PDUCD_GHMC. Happy that he’s ready to arrange more if needed.@KTRTRS @arvindkumar_ias pic.twitter.com/jfloUx0oGG
— BonthuRammohan,Mayor (@bonthurammohan) April 15, 2020
కాగా ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా నాని హీరోగా ‘వి’ సినిమా తెరకెక్కించాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంకా అల్లు అర్జున్ హీరో గా ఐకాన్ సినిమాను కూడా తెరకెక్కించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: