పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, “మెలోడి బ్రహ్మ” మణిశర్మ కాంబినేషన్‌లో పలు మ్యూజికల్ హిట్స్ సందడి చేశాయి. వాటిలో ‘తీన్‌మార్’ ఒకటి. జయంత్ సి.పరాన్జీ రూపొందించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పవన్ తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు. అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం.. ఇలా రెండు వేర్వేరు కాలాలకు చెందిన రెండు విభిన్న పాత్రల్లో దర్శనమిచ్చాడు పవన్. ముఖ్యంగా “అర్జున్ పాల్వాయ్” పాత్ర పవన్‌కు మంచి పేరు తీసుకురావడమే కాకుండా.. సినిమాకే హైలైట్‌గా నిలిచింది. హిందీ చిత్రం ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో.. పవన్ సరసన త్రిష, కృతి కర్బందా నాయికలుగా నటించారు. పరేష్ రవాల్, ముకేష్ రుషి, ప్రగతి, తనికెళ్ళ భరణి, సుధ, సోనూసూద్, అలీ ముఖ్య భూమికలు పోషించారు. పవన్‌కు బాగా కలిసొచ్చిన దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, విశ్వ, రెహమాన్ గీత రచన చేయగా.. “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందించారు. “వయ్యారాల జాబిల్లి”, “ఆలబాలే”, “బార్బీ బొమ్మకి”(“ఓహో బస్తీ దొరసాని”కి రీమిక్స్), “చిగురు బోయిన”, “గెలుపు తలుపులే”, “శ్రీ గంగ”.. ఇలా అన్ని పాటలు శ్రోతలను అలరించాయి. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మించాడు. 2011 ఏప్రిల్ 14న విడుదలైన `తీన్‌మార్’.. నేటితో 9 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: