మ‌హేష్ బాబు ‘యువ‌రాజు’కు 20 ఏళ్ళు

20 Years For Yuvaraju Telugu Movie, Latest Telugu Movies News, Latest Tollywood News, Super Star Mahesh Babu’s Youthful Entertainer Yuvaraju Completes 20 Years, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Yuvaraju, Yuvaraju Movie, Yuvaraju Movie Completes 20 Years, Yuvaraju Movie Updates, Yuvaraju Telugu Movie, Yuvaraju Telugu Movie Latest News

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్‌లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘యువ‌రాజు’ ఒకటి. సిమ్ర‌న్, సాక్షి శివానంద్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాలో.. వెంక‌ట్, చంద్ర‌మోహ‌న్, శివాజి, అలీ, వేణు మాధ‌వ్, బండ్ల గ‌ణేష్, వ‌ర్ష‌, మాస్ట‌ర్ తేజ, బేబి శ్రీదివ్య‌ ముఖ్య పాత్ర‌లు పోషించారు. వై.వి.య‌స్.చౌద‌రి తెర‌కెక్కించిన‌ ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను బూరుగపల్లి శివ‌రామ‌కృష్ణ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామ‌శాస్త్రి, చంద్ర‌బోస్ గీత ర‌చ‌న చేయ‌గా.. ర‌మ‌ణ గోగుల చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్‌ను అందించారు. వాటిలో “తొలివ‌ల‌పే”, “నూక‌లిస్తే”, “హాయ్‌రా హాయ్ దెబ్బ”, “గుంత‌ల‌కిడి”, “మ‌న‌సేమో”, “రామ చిల‌క‌”, “చంద‌మామ‌”, “ఓల‌మ్మో”, “ట్వింకిల్ ట్వింకిల్” వంటి పాట‌లు విశేషాద‌ర‌ణ పొందాయి. 2000 ఏప్రిల్ 14న విడుదలైన `యువ‌రాజు`… నేటితో 20 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

‘యువ‌రాజు’ – కొన్ని విశేషాలు:

* ఇటు సిమ్ర‌న్‌తోనూ, అటు సాక్షి శివానంద్‌తోనూ మ‌హేష్ న‌టించిన ఏకైక చిత్రం ‘యువ‌రాజు’.
* వై.వి.య‌స్.చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలోనూ, నిర్మాత బూరుగప‌ల్లి శివ‌రామ‌కృష్ణ నిర్మాణంలోనూ మ‌హేష్ న‌టించిన వ‌న్ అండ్ ఓన్లీ ఫిల్మ్ ‘యువ‌రాజు’.
* మ‌హేష్, సంగీత ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ గోగుల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఒకే ఒక్క సినిమా ఇది.
* మహేష్‌ను “ప్రిన్స్”గా మార్చిన చిత్రమిది.
* అలాగే పాత్ర న‌చ్చితే ఎటువంటి ప్ర‌యోగాన్నైనా చేయ‌డానికైనా ముందుండే మహేష్.. త‌న కెరీర్‌లోని రెండో సినిమాతోనే తండ్రి పాత్ర‌లో న‌టించ‌డం అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − one =