బాలకృష్ణ ‘భైర‌వ‌ద్వీపం’కు 26 ఏళ్ళు

26 Years For Bhairava Dweepam Telugu Movie, Bhairava Dweepam, Bhairava Dweepam Movie, Bhairava Dweepam Movie Completes 26 Years, Bhairava Dweepam Movie Updates, Bhairava Dweepam Telugu Movie, Bhairava Dweepam Telugu Movie Latest News, Latest Telugu Movies News, Latest Tollywood News, Nandamuri Balakrishna’s Timeless Classic Bhairava Dweepam Completes 26 Years, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

జాన‌ప‌దం, పౌరాణికం, చారిత్ర‌కం, సాంఘికం.. ఇలా జాన‌ర్ ఏదైనా త‌న‌దైన న‌ట‌నాపాట‌వంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించే క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆయా జాన‌ర్‌ల‌లో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రచే ఈ నంద‌మూరి వార‌సుడు.. కెరీర్‌లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే పాత్ర‌లో న‌టించిన జాన‌ప‌ద చిత్రం ‘భైర‌వ‌ద్వీపం’. లెజెండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీ‌నివాస‌రావు తెర‌కెక్కించిన ఈ సినిమాలో.. బాల‌కృష్ణకు జోడిగా రోజా న‌టించింది. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, సంగీత‌, విజ‌య్ కుమార్, కె.ఆర్‌.విజ‌య‌, విజ‌య రంగ‌రాజు, బాబూమోహ‌న్, ర‌జిత‌, ‘శుభ‌లేఖ’ సుధాక‌ర్, గిరిబాబు, మిక్కిలినేని, ప‌ద్మ‌నాభం ముఖ్య భూమిక‌లు పోషించ‌గా.. య‌క్షిణిగా క‌థ‌ను మ‌లుపుతిప్పే పాత్ర‌లో రంభ సంద‌డి చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుంద‌ర‌రామ‌మూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామ‌శాస్త్రి, సింగీతం శ్రీ‌నివాస‌రావు, వ‌డ్డేప‌ల్లి కృష్ణ సాహిత్యం స‌మ‌కూర్చగా.. మాధ‌వ‌పెద్ది సురేష్ జ‌న‌రంజ‌క‌మైన బాణీలు అందించారు. “న‌రుడా ఓ న‌రుడా”, “విరిసిన‌ది వ‌సంత‌గానం”, “శ్రీ తుంబుర నార‌ద”, “ఎంత ఎంత వింత మోహమో”, “ఘాటైన ప్రేమ ఘ‌ట‌న”, “అంబా శాంభ‌వి”.. ఇలా పాట‌ల‌న్నీ సంగీతప‌రంగానూ, సాహిత్యప‌రంగాను విశేషంగా అల‌రించాయి. చంద‌మామ విజ‌యా కంబైన్స్ ప‌తాకంపై బి.వెంక‌ట‌రామిరెడ్డి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్ర‌రాజం.. ఉత్త‌మ తృతీయ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు (సింగీతం శ్రీ‌నివాస‌రావు), ఉత్త‌మ మేక‌ప్ మాన్‌ (ఎం.స‌త్యం), ఉత్త‌మ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌ (కొండ‌ల రెడ్డి), ఉత్త‌మ ఆడియోగ్రాఫ‌ర్ (కొల్లి రామ‌కృష్ణ‌), ఉత్త‌మ ఆర్ట్ డైరెక్ట‌ర్‌ (పేకేటి రంగా), ఉత్త‌మ గాయ‌ని (ఎస్‌.జాన‌కి – “న‌రుడా ఓ నరుడా”), ఉత్త‌మ గాయ‌కుడు (ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం – “శ్రీ తుంబుర నార‌ద”), ఉత్త‌మ ఛాయాగ్రాహ‌కుడు (క‌బీర్ లాల్) వంటి విభాగాల్లో నంది అవార్డుల‌ను కైవ‌సం చేసుకుంది. ఏప్రిల్ 14, 1994న విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన‌ `భైర‌వద్వీపం`.. నేటితో 26 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 4 =