జనతా కర్ఫ్యూ పై సినీ ప్రముఖుల స్పందన

Celebrities and Top Film Stars Extend Their Support For Janta Curfew

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రజల ధన , ప్రాణ నష్టాలకు కరోనా వైరస్ హేతువుగా మారింది. ఇటువంటి పరిస్థితులలో దేశంలోని ప్రతీ ఒక్కరూ కరోనా వైరస్ నియంత్రణ కై 22వ తేదీ (ఆదివారం ) జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనతా కర్ఫ్యూ పై తమ స్పందన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సేవాభావం తో పనిచేస్తున్న వైద్య బృందాలకు , స్వఛ్చ కార్మికులకు, పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ , ప్రశంసించాల్సిన సమయం ఇదని , ప్రధాని పిలుపుకు స్పందిస్తూ ఆదివారం ఉదయం7గంటలనుండి రాత్రి 9గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటిద్దామని, ఇళ్ళకే పరిమితం అవుదామని, సాయంత్రం 5గంటలకు సేవలందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుదామని, భారతీయులందరూ ఐకమత్యం తో ఒకటిగా నిలబడి ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొందామని, కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం అని చిరంజీవి ట్వీట్ చేశారు.

ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ ను అందరూ పాటిద్దామని, అంకిత భావం తో కరోనా వైరస్ కట్టడి కై కృషి చేస్తున్న వైద్య బృందానికి , ఇతర డిపార్ట్ మెంట్స్ కు ఆదివారం 5గంటలకు జయధ్వానాలు పలుకుదాం అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ప్రధాని పిలుపు మేరకు ప్రతీ ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటిద్దామని, కరోనా వైరస్ కట్టడి కై కృషి చేస్తున్న వారందరికీ ఆరోజు ధన్యవాదాలు తెలుపుదామని , సినిమా 24 క్రాఫ్ట్స్ కూడా సంఘీభావం తెలుపాలని, ప్రధాని సూచన పాటించి కరోనా రహిత భారతాన్ని సాధిద్దాం అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 20 =