`ఆర్య‌` విడుద‌ల‌ తేదికి `ఉప్పెన‌`?

Vaishnav Tej Uppena To Release On Arya Release Date

మెగా కాంపౌండ్ నుంచి మ‌రో టాలెంటెడ్ హీరో తెరంగేట్రం చేయ‌నున్నాడు. అత‌డే.. మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, `సుప్రీమ్` హీరో సాయితేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్. `ఉప్పెన‌` పేరుతో రూపొందిన ఈ ప్రేమ‌క‌థా చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు బుచ్చి బాబు సానా తెర‌కెక్కించాడు. కాగా, తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే, క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమా వాయిదా ప‌డింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా స‌మాచారం ప్ర‌కారం… `ఉప్పెన‌`ని మే 7న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. అదే గ‌నుక నిజ‌మైతే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని మ‌లుపు తిప్పిన‌ `ఆర్య‌`(2004) విడుద‌ల తేదికి `ఉప్పెన‌` వ‌స్తున్న‌ట్లే. `ఆర్య‌`కి సంగీత‌మందించిన దేవిశ్రీ‌ప్ర‌సాద్ `ఉప్పెన‌`కి కూడా బాణీలు అందించాడు. అలాగే సుకుమార్ ట‌చ్ కూడా ఉండ‌నే ఉంది. అంతేకాదు.. మే 7కి `ఉప్పెన‌` వ‌స్తున్న‌ట్ల‌యితే… మే 1కి సాయితేజ్ `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` కూడా రిలీజ్ కానుంది కాబ‌ట్టి.. వారం రోజుల్లో అన్న‌ద‌మ్ములు సంద‌డి చేస్తున్న‌ట్లే అవుతుంది. మ‌రి.. వారం గ్యాప్ లోనే అన్న‌ద‌మ్ములు వ‌స్తారా? లేదా? అన్న‌ది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + ten =