`తొలిప్రేమ`(1998)… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్. ఈ సినిమాతోనే పవన్ కెరీర్ మేలిమలుపు తీసుకుంది. ఎ. కరుణాకరన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం… అప్పట్లో భారీ విజయం సాధించింది. ఆ యేటి మేటి చిత్రాల్లో ఒకటిగా నిలచింది. ఇప్పటి తరాన్ని సైతం ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ విశేషంగా అలరిస్తూనే ఉంది. కట్ చేస్తే.. 22 ఏళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినిపిస్తున్న కథనాల ప్రకారం… దర్శకుడు ఎ.కరుణాకరన్ `తొలిప్రేమ`ని కొనసాగించే దిశగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఈ మేరకు చర్చలు సాగిస్తున్నాడని తెలిసింది. స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పవన్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. త్వరలోనే ఈ సీక్వెల్ పై ఫుల్ క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతం `వకీల్ సాబ్`, క్రిష్ డైరెక్టోరియల్స్ తో బిజీగా ఉన్నాడు పవన్. ఆపై పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ వరుసలోనే `తొలిప్రేమ` సీక్వెల్ చేరడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: