నిన్న జరిగిన “మెగాస్టార్ ద లెజెండ్” పుస్తకావిష్కరణ సభలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ అయిన స్వామి నాయుడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ “అభిమానులకు మా కుటుంబానికి మధ్య సంధాన కర్తగా, బ్లడ్ బ్యాంక్ మేనేజర్ గా అంకితభావంతో పనిచేస్తున్న స్వామి నాయుడుకు కృతజ్ఞతలు , అభినందనలు” అన్నప్పుడు అభిమానుల హర్షధ్వానాలు మిన్నంటాయి. అలాంటి మెగా ఈవెంట్ లో రామ్ చరణ్ ప్రత్యేకంగా తన పేరు ప్రస్తావిస్తూ అభినందించడంతో స్వామి నాయుడు ఆనందంతో పులకించిపోయారు. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం రామ్ చరణ్ కు ఒక ‘థాంక్స్ గివింగ్ మెసేజ్ ‘ పంపారు స్వామి నాయుడు. మెగాస్టార్ చిరంజీవే తనకు సర్వస్వం అని సగర్వంగా చెప్పుకునే
స్వామి నాయుడి స్వామి భక్తికి, ఆ కుటుంబంతో తనకు గల అనుబంధానికి అక్షర రూపంగా నిలిచింది ఆ మెసేజ్ . ఉరకలెత్తే అభిమానుల ఉత్సాహం నిరుపయోగం కాకూడదనే ఉద్దేశంతో వారిని సేవా కార్యక్రమాల వైపు మళ్లించాలి అన్న మెగాస్టార్ ఆలోచనను సమర్థవంతంగా అమలుచేస్తున్న స్వామి నాయుడు నిజంగా అభినందనీయుడు. కాగా రామ్ చరణ్ కు స్వామి నాయుడు పంపిన థాంక్స్ మెసేజ్ ఏమిటో చూద్దాం…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారు !
అదృష్టం… అవధులులేని ఆనందం… అనూహ్యంగా ఊహించని అపురూప క్షణాలు… ఉక్కిరి బిక్కిరి అవ్వగా …. హృదయం అంతా పులకింతల పాల సంద్రమై గగన తీరాల్ని తాకింది. ఎన్నో జన్మల పుణ్య ఫలం… ఈరోజు గుండె గుప్పిట్లో వాలింది. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి సన్నిధిలో ప్రపంచాన్ని చూస్తున్న నాకు మెగాపవర్ స్టార్ “చిరు” తనయుడైన మీరు కూడా సంపూర్ణంగా ప్రేమాభిమానాలు పంచడంతో కన్నీళ్లతో రెప్పలు తడిసాయి.
స్వయంకృషితో అంతెత్తుకు ఎదిగిన శ్రీ చిరంజీవి గారి జీవితం అక్షరాల్లోకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించిన “మెగాస్టార్ ది లెజెండ్” పుస్తకాన్ని ఆహుతులు, అభిమానుల సమక్షంలో మీ చేతుల మీదుగా అందుకోవడానికి మించిన సౌభాగ్యంమేముంటుంది? అంతటి అదృష్టాన్ని కలుగజేసిన మీకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తూ…
సదా మెగా సేవలో తరిస్తానని…
ఈ జీవితం మీకే అంకితమని పునరుద్ఘాటిస్తూ శిరస్సు వంచి అభివాదాలు చేస్తున్నాను .
ఎప్పటికీ…
మీ…
సేవలో…
రవణం స్వామినాయుడు
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: