తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వాని. రెండు భాషల్లో కలిపి ఇప్పటివరకు ఈ టాలెంటెడ్ బ్యూటీ ఏడు చిత్రాల్లో నాయికగా నటించగా.. వాటిలో నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కాగా, ప్రస్తుతం కియారా నాలుగు హిందీ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుండగా… వాటిలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తన బర్త్ డే స్పెషల్ గా జూలై 31న రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే… 2007 నాటి హారర్ కామెడీ ఫిల్మ్ `భూల్ భులయ్యా`(`చంద్రముఖి` రీమేక్)కి సీక్వెల్ గా రూపొందుతున్న `భూల్ భులయ్యా`లో కియారా నాయికగా నటిస్తోంది. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కాగా, జూలై 31న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది.. మరి…. తన పుట్టినరోజు కానుకగా విడుదల కానున్న ఈ సినిమాతో కియారా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: