`వి`.. నాని మ‌ల్టీపుల్ హ్యాట్రిక్స్

V Movie To Give Multiple Hat Trick Success To Nani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,V Movie Updates,V Telugu Movie Latest News,Nani New Movie Details,Nani Upcoming Film News,Nani Latest Movie Details,Nani Next Project News

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం)గా రూపొందుతున్న చిత్రం `వి`. సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావ్ హైద‌రీ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఇంద‌గ్రంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. `దిల్` రాజు నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజ‌ర్ అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. ఉగాది కానుక‌గా మార్చి 25న రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే.. `వి` విజ‌యం సాధిస్తే.. నానికి మూడు ర‌కాల కాంబినేష‌నల్ హ్యాట్రిక్స్ న‌మోదు అవుతాయి. `అష్టా చ‌మ్మా`, `జెంటిల్ మన్` త‌రువాత ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి కాంబినేష‌న్ లో ఒక హ్యాట్రిక్.. `నేను లోక‌ల్`, `ఎంసీఏ` త‌రువాత నిర్మాత‌`దిల్` రాజు కాంబినేష‌న్ లో మ‌రో హ్యాట్రిక్.. `జెంటిల్ మ‌న్`, `నిన్ను కోరి` త‌రువాత నాయిక‌ నివేదా థామ‌స్ తో ఇంకో హ్యాట్రిక్.. నాని ఖాతాలో జ‌మ అవుతాయి. మ‌రి.. మ‌ల్టీపుల్ హ్యాట్రిక్స్ కి కేరాఫ్ గా నిలుస్తున్న `వి`.. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 11 =