రివైండ్ 2019… మైల్ స్టోన్ జ‌ర్నీ

2019 Star Special Milestone Journey Movies

ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్… ప‌లువురు ప్ర‌ముఖుల చిత్ర ప్ర‌యాణానికి `ల్యాండ్ మార్క్`గా నిల‌చింది. వీరిలో క‌థానాయ‌కుల‌తో పాటు సంగీత ద‌ర్శ‌కులు, ద‌ర్శ‌కులు కూడా ఉండ‌డం విశేషం. ఆ వివ‌రాల్లోకి వెళితే…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ‌హేష్ బాబు: 2019 సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి ఎంతో స్పెష‌ల్. ఎందుకంటే… ఈ ఏడాది విడుద‌లైన `మ‌హ‌ర్షి`తో క‌థానాయ‌కుడిగా పాతిక చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు మ‌హేష్. అలాగే `రాజ‌కుమారుడు` (1999)తో హీరోగా కెరీర్ ని ఆరంభించిన ఈ సూప‌ర్ స్టార్… ఈ సంవ‌త్స‌రంతో 20 ఏళ్ళ ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్నాడు.

సుమ‌న్: దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా న‌టుడిగా అల‌రిస్తున్నారు ఒక‌ప్ప‌టి హ్యాండ్సమ్ హీరో సుమ‌న్. ఇప్ప‌టికే వందలాది చిత్రాల్లో త‌న అభిన‌యంతో క‌నువిందు చేసిన సుమ‌న్… `అయ్య‌ప్ప క‌టాక్షం`తో క‌థానాయ‌కుడిగా సెంచరీ కంప్లీట్ చేశారు. ఈ సంవ‌త్స‌రాంతంలో ఈ ఆధ్యాత్మిక చిత్రం రిలీజైంది.

జ‌గ‌ప‌తి బాబు: `సింహ‌స్వ‌ప్నం`(1989)తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగేసిన విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు… ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రితో న‌టుడిగా 30 వసంతాల చిత్ర ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్నాడు.

ర‌వితేజ‌: చిరు చిరు పాత్ర‌ల‌తో న‌ట‌జీవితాన్ని ప్రారంభించిన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌… 1999లో విడుద‌లైన `నీ కోసం`తో సోలో హీరోగా జ‌ర్నీ స్టార్ట్ చేశాడు. ఆ సినిమా విడుద‌లై ఈ సంవ‌త్స‌రంతో రెండు ద‌శాబ్దాలు పూర్త‌య్యింది.

త్రివిక్ర‌మ్‌, దేవిశ్రీ ప్ర‌సాద్, శ్రీ‌ను వైట్ల‌, ఆర్పీ పట్నాయ‌క్: `స్వ‌యంవ‌రం` (1999)తో మాటల ర‌చ‌యిత‌గా ప‌రిచ‌య‌మైన త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, `దేవి`(1999)తో మ్యూజిక్ కంపోజ‌ర్ గా ఇంట్ర‌డ్యూస్ అయిన దేవిశ్రీ ప్ర‌సాద్, `నీకోసం`(1999)తో ద‌ర్శ‌కుడైన శ్రీ‌నువైట్ల‌, సంగీత ద‌ర్శకుడైన ఆర్పీ ప‌ట్నాయ‌క్ ఈ సంవ‌త్స‌రంతో 20 ఏళ్ళ ప్ర‌యాణం పూర్తిచేసుకున్నారు.

నాగ‌చైత‌న్య‌, నారా రోహిత్, థ‌మ‌న్: `జోష్`(2009)గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని మూడో త‌రం క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, `బాణం`(2009)లా దూసుకొచ్చిన‌ నారా వారింటి తొలి కథానాయ‌కుడు నారా రోహిత్… అలాగే `కిక్` (2009) వినాలనిపించే బాణీల‌తో మురిపించిన థ‌మ‌న్… ఈ సంవ‌త్స‌రంతో ద‌శాబ్ద ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్నారు.

అలాగే `పిల్లా నువ్వు లేని జీవితం` (2014)తో హీరోగా ప‌రిచ‌య‌మైన సాయితేజ్, `ముకుంద‌`(2014)తో క‌థానాయ‌కుడైన వ‌రుణ్ తేజ్… ఐదేళ్ళ ప్ర‌యాణాన్ని దిగ్విజ‌యంగా పూర్తిచేసుకున్నారు.

మొత్తానికి… ప‌లువురు ప్ర‌ముఖుల `ల్యాండ్ మార్క్` జ‌ర్నీకి 2019 వేదిక‌గా నిలిచింద‌న్న‌మాట‌.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + six =