కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

'విజయ్ 64' టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

'విజయ్ 64' టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
ఫస్ట్ లుక్1 ని. చదువు

'విజయ్ 64' టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

Vijay New Movie Titled As Master

'విజయ్ 64' టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఇమేజ్, స్టార్‌డమ్ తెచ్చుకున్న హీరో విజయ్‌.. ఇటీవల ‘బిగిల్’ (విజిల్) సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఇక తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మాస్టర్ అనే టైటిల్ టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు.

కాగా ఈ సినిమాలో మాళవిక మోహనన్ విజయ్‌ కు జోడీగా నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది 2020 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్