తెలుగునాట ఈ ఏడాది పలువురు తారలు రీ ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొందరు విజయాలు చూస్తే… మరికొందరు అభినయంతో మెప్పించారు. ఆ వివరాల్లోకి వెళితే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లక్ష్మి:
దక్షిణాది నాలుగు భాషల్లోనే కాదు హిందీ చిత్ర పరిశ్రమలో కూడా కథానాయికగా తనదైన ముద్ర వేసింది సీనియర్ యాక్ట్రస్ లక్ష్మి. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటిగా పేరు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్… గత కొంతకాలంగా అమ్మ, బామ్మ పాత్రల్లో అలరిస్తోంది. కాగా, నాలుగేళ్ళ క్రితం విడుదలైన ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే’ (2015) సినిమా కోసం చివరిసారిగా తెలుగు తెరపై కనిపించిన లక్ష్మి… ఈ సంవత్సరం రీ-ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మూడు వరుస నెలల్లో మూడు చిత్రాలతో సందడి చేసింది. జూలై లో విడుదలైన ‘ఓ బేబి’లో బేబిగా సందడి చేసిన లక్ష్మి… ఆగస్టులో విడుదలయిన ‘మన్మథుడు 2’లో నాగార్జునకి అమ్మ పాత్రలో దర్శనమిచ్చింది. ఇక సెప్టెంబర్ లో రిలీజైన నాని ‘గ్యాంగ్ లీడర్’లో కథలో కీలకమైన బామ్మ పాత్రలో సందడి చేసింది. వీటిలో ‘ఓ బేబి’ మంచి విజయం సాధించింది.
మమ్ముట్టి:
దక్షిణాదిన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి… దాదాపు రెండు దశాబ్దాల తరువాత టాలీవుడ్ లో స్ట్రయిట్ పిక్చర్ తో సందడి చేశారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై. ఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’లో వై.ఎస్.ఆర్ గా ఆయన అలరించారు.
ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజైన ‘వినయ విధేయ రామ’లో నటి స్నేహ, ఒకప్పటి కథానాయకులు ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్ కీలక పాత్రల్లో నటించారు. వీరందరికీ కూడా ఇది రీ-ఎంట్రీ మూవీనే కావడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: