స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన “అల .. వైకుంఠ పురములో ..” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. టబు, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, సుశాంత్, నివేత పేతురాజ్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన “అల .. వైకుంఠ పురములో ..” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అల .. వైకుంఠ పురములో ..” మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మ్యూజిక్ ఫెస్టివల్ ను జనవరి 6వ తేదీ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా జరుపనుంది. ఈ మూవీ లోని అత్యంత ప్రజాదరణ పొందిన “సామజవరగమన” సాంగ్ ప్రోమో నూతన సంవత్సర కానుకగా 31 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్ కు అద్భుత స్పందన లభించింది. భారీ అంచనాలతో రిలీజ్ కానున్న “అల .. వైకుంఠ పురములో ..” మూవీకై ప్రేక్షక, అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: