తెలుగునాట ఈ సంవత్సరం పలు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ సందడి చేశాయి. స్టార్ హీరోయిన్స్ నుంచి రైజింగ్ బ్యూటీస్ వరకు ఈ తరహా చిత్రాల్లో మెరిసారు. వీరిలో ఇప్పటికే ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటించిన బ్యూటీస్ తో పాటు ఇప్పటివరకు ఆ తరహా చిత్రాల్లో కనిపించని భామలు కూడా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సీత’తో కాజల్ అగర్వాల్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి శ్రీకారం చుడితే… ‘ఓ బేబి’తో సమంత, ‘అభినేత్రి 2’తో తమన్నా, ‘గేమ్ ఓవర్’తో తాప్సీ మరోసారి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో పలకరించారు.
ఇక నిరుడు ‘ఆర్ ఎక్స్ 100’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాయల్ రాజ్ పుత్… ఈ సంవత్సరం ‘ఆర్డీఎక్స్ లవ్’ అంటూ పలకరించింది. తనకు ఇదే ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కావడం విశేషం.అలాగే తెలుగుమ్మాయిలు నిహారిక, ఐశ్వర్యా రాజేష్, ఈషా రెబ్బా, అనసూయ కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ బాట పట్టారు. ‘సూర్యకాంతం’గా నిహారిక, ‘కౌసల్య కృష్ణమూర్తి’గా ఐశ్వర్యా రాజేష్ సందడి చేయగా… ‘రాగల 24 గంటల్లో’ అంటూ ఈషా రెబ్బా, ‘కథనం’తో అనసూయ థ్రిల్ చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ‘దొరసాని గా శివాత్మిక రాజశేఖర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే… ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ అంటూ రాయ్ లక్ష్మి పలకరించింది.
మరి… వచ్చే ఏడాది ఈ జాబితాలో ఇంకెన్ని నాయిక ప్రాధాన్య చిత్రాలు సందడి చేస్తాయో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































