ఆ రోజు చిరంజీవిలో కాన్ఫిడెన్స్ నింపింది వీరయ్య అనే కానిస్టేబులట!

Interesting Facts About Megastar Chiranjeevi Revealed

నాలుగు దశాబ్దాల అనితరసాధ్యమైన సినీ ప్రస్థానంలో మెగాస్టార్ చిరంజీవి సాధించిన విజయాల గురించి, చేరుకున్న శిఖరాగ్రల గురించి అందరికీ తెలుసు. వర్ధమాన నటుడి స్థాయి నుండి మెగాస్టార్ దాకా సాగిన సుదీర్ఘ ప్రస్థానంలోని పరిణామక్రమమంతా తెరిచిన పుస్తకమే. ఎవరి అండ దండలు లేకుండా ఒక్కడిగా, ఒంటరిగా మద్రాసు సినీ జనారణ్యంలో కాలుమోపిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు చిత్ర పరిశ్రమలో సెకండ్ జనరేషన్ లీడింగ్ స్టార్ గా ఎదుగుతారని ఎవరూ ఊహించలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఆయన నేటి సమున్నత స్థానానికి చేరుకుంటారని ఆయన కూడా అనుకొని ఉండరు.
అయితే తన గురించి తానే కాదు… ఎవరూ ఏమి అనుకోని రోజుల్లోనే ఒక వ్యక్తి మాత్రం “నువ్వు చాలా గొప్పోడివి అవుతావు బాబూ ” అని ప్రోత్సహించిన కథనాన్ని చిరంజీవి ఇటీవల ఒక ఫంక్షన్లో వెల్లడించారు.
ఒక సామాన్యుడు కలిగించిన కాన్ఫిడెన్స్ ఒక అసామాన్యున్ని తయారు చేయగలదు అనటానికి నిదర్శనంగా నిలుస్తుంది చిరంజీవి చెప్పిన ఆ ఫ్లాష్ బ్యాక్… అదేమిటో మీరూ చదవండి…

ఇటీవల టీవీ9 ఛానల్ వారు నవరత్నాలు పేరున వివిధ రంగాలలో స్ఫూర్తిదాయకమైన కృషి చేసినవారిని
సత్కరించే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఆ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి.ఇలాంటి అవార్డులు, సత్కారాలు వ్యక్తులలో ఎలాంటి ఉత్సాహ ప్రోత్సాహాలను నింపుతాయో వివరించే క్రమంలో చిరంజీవి చెప్పిన కానిస్టేబుల్ వీరయ్య కథనానికి సభలో గొప్ప రెస్పాన్స్ వచ్చింది.
అదేమిటో ఆయన మాటల్లోనే విందాం. “అవి మా నాన్నగారు చీరాలలో ఎస్సైగా జాబ్ చేస్తున్న రోజులు. ఆ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ పని చేస్తుండేవాడు. నేను చెప్పే డైలాగులు, చేసే యాక్షన్ మూమెంట్స్ అతనికి తెగ నచ్చేవి… నన్ను చాలా మెచ్చుకునేవాడు. నేను ఏదో క్యాజువల్ గా తీసుకునేవాడిని.

ఒకరోజు ఉన్నట్టుండి ‘బాబు మిమ్మల్ని చూస్తుంటే అచ్చం శత్రుఘ్నసిన్హా లాగా ఉన్నారు… అలాగే చేస్తున్నారు… మీరు అర్జెంటుగా సినిమా ఫీల్డ్ కు వెళ్లండి ‘ అన్నాడు. ‘శత్రుఘ్నసిన్హా లాగా ఉన్నావు ‘అన్నమాట నా మీద బాగా పని చేసింది. అంతటితో ఆగకుండా నన్ను బలవంతంగా ఫోటో స్టూడియోకు తీసుకెళ్లి ఫోటోలు తీయించి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి పంపించాడు. ఆ ఫొటోలు చూసి వెంటనే నన్ను సెలెక్ట్ చేసినట్లుగా లెటర్ వచ్చింది. ఆ విధంగా నాకు అడయార్ ఫిలిమ్ ఇన్స్టిట్యూట్ లో సీట్ వచ్చింది.ఒక చిన్న కానిస్టేబుల్ అయినప్పటికీ అతను నాలో నింపిన కాన్ఫిడెన్స్ నన్ను ఈ రోజు మీ ముందు నిలబెట్టింది. చీరాల పక్కనే ఉన్న పేరాలకు చెందిన ఆ కానిస్టేబుల్ పేరు వీరయ్య ” అంటూ చిరంజీవి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ఆనాటి కార్యక్రమ ఔచిత్యానికి అద్దం పట్టింది. చిరంజీవి కెరీర్ ప్రారంభ దశలోని విశేషాలన్నీ అందరికీ తెలిసినవే అయినా ఈ వీరయ్య ఉదంతం మాత్రం ఇలా కొత్తగా వెలుగులోకి వచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =