సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడలో ‘అవనే శ్రీమన్ నారాయణ’ పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా అక్కడ ఈ రోజు రిలీజ్ అయింది. అక్కడ రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రివ్యూలను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అన్ని చోట్ల నుండి పాజిటివ్ రివ్యూలను ఇచ్చాయి. ఈ సినిమాలో రక్షిత్ షెట్టి నటనకు కూడా క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. అంతేకాదు ఇంగ్లీష్ మీడియా వర్గాలు సైతం రక్షిత్ ను ప్రశంసించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాని కన్నడంతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాటీజర్, ట్రైలర్ లకు మాత్రం ఇక్కడ బాగానే రెస్పాన్స్ వచ్చింది. మరి తెలుగులో ఎలా ఉంటుందో..? ఇక్కడ కూడా హిట్ అవుతుందో?లేదో? తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా శాన్వి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ “అతడే శ్రీమన్నారాయణ” మూవీ జనవరి 1 వ తేదీన రిలీజ్ అవుతుండగా.. తమిళ “అవనే శ్రీమన్నారాయణ ” , మలయాళ “అవన్ శ్రీమన్నారాయణ ” వెర్షన్స్ జనవరి 3వ తేదీన, హిందీ “అడ్వెంచర్స్ ఆఫ్ శ్రీమన్నారాయణ” జనవరి 17 వ తేదీన రిలీజ్ కానున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: