ఫలితంతో సంబంధం లేకుండా రవితేజ దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఈయన జోరు తగ్గడం లేదు. వరస సినిమాలతో సత్తా చూపిస్తున్నాడు. గతేడాది టచ్ చేసి చూడు.. నేల టికెట్టు.. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలతో వచ్చాడు. ఇప్పుడు తాజాగా మరో డిఫెరెంట్ మూవీతో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్ థ్రిల్లర్ ‘డిస్కోరాజా’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.
ఇదిలా ఉండగా అప్పుడే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమా విషయంలో చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉందట. సినిమా ఎలా ఉందనే విషయమై చిత్ర బృందాన్ని అడిగితే ఔట్ పుట్ బాగా వస్తోందని, రవితేజ కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని అంటున్నారట. అంతేకాదు.. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే బలమైన కథాకథనాలు .. రవితేజ ద్విపాత్రాభినయం .. నభా నటేశ్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్ వంటి ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ .. తమన్ సంగీతం .. తమిళ స్టార్ హీరో బాబీసింహా విలక్షణమైన విలనిజం .. ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా చెబుతున్నారు. ఇక రవితేజ కూడా తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందనీ, ఇది తప్పకుండా తనకి బ్లాక్ బస్టర్ హిట్ ను తెచ్చిపెడుతుందని భావిస్తున్నాడట.
ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సునీల్, రామ్‌కీ, బాబీ సింహా, వెన్నెల కిశోర్, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.
మరి గత కొంతకాలంగా సరైన హిట్ పడక సతమతమౌతున్న రవితేజ ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలని చూస్తున్నాడు. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా రవితేజాకు మంచి సక్సెస్ వస్తుందేమో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: